హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జీవో జారీ.. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల రద్దు...

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకుని ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు చేశారు. పరీక్షల రద్దుపై జీవో జారీ చేశారు. అటు, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను సెకండియర్ లోకి ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఫలితాలను ఏ ప్రాతిపదికన కేటాయించాలనే విషయంలో ఇంటర్ బోర్డుకు అధికారాలు మంజూరు చేశారు. దీనిపై కసరత్తు చేసిన ఇంటర్ బోర్డు, రేపు ఇంటర్ ఫలితాల విధివిధానాలను ప్రభుత్వానికి పంపనుంది. ప్రభుత్వం ఆమోదం తెలిపాక రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలను ప్రకటిస్తారు.

ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. సరయిన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు జనానికి ఇబ్బందులు తప్పవు. సో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

govt go issued by inter second year exam

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది.. కానీ అదీ కూడా తగ్గుముఖం పడుతుందని చెప్పడం కాస్త సానుకూల అంశం. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.

ఈ నెల 21వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా తీసుకోవచ్చు అని చెప్పారు. కానీ అందుకు నామమాత్ర రుసుం రూ.250 ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. ఇప్పటికీ వ్యాక్సిన్ కొరత ఉంది. కానీ దానిని అధిగమిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అందరికీ వ్యాక్సిన్ అందజేస్తే కరోనాను జయించడం తేలికే అవుతుంది.

English summary
telangana government go issued by inter second year exam cancel matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X