ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్: గంటన్నరలోపు పరీక్ష.? విద్యాశాఖ కసరత్తు

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. సెకండ్ ఇయర్ స్టూడెంట్లకు ఫస్టియర్ ఆధారంగా మార్కులు నిర్ణయించి పాస్ చేశారు. మొదటి సంవత్సరం చదివే విద్యార్థుల కేటాయింపు ఎలా చేయాలా అనేది తేలకుండా పోయింది. ఒకవేళ 35 శాతం మార్కులతో అందరినీ పాస్ చేయాలని భావిస్తే కొందరు దానిని వ్యతిరేకత వస్తోంది.

Recommended Video

    #TOPNEWS: AP 10th And Inter Exams| Kadtal Farmhouse|Vizag Steel Plant Privatization| Oneindia Telugu

    పరీక్షలు నిర్వహించడానికే విద్యాశాఖ మొగ్గు చూపుతుంది. పరీక్షల సమయాన్ని కుదించాలని విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మూడు గంటల పాటు ఉండే పరీక్షా సమయం.. కరోనా నేపథ్యంలో గంటన్నరకు కుదించాలని అనుకుంటున్నారు. దీనికి సంబంధించి సాధ్యసాధ్యాలు, ఇతర అంశాలను పరిశీలిస్తున్నారు. కానీ కరోనా వల్ల విద్యార్థుల ప్రమోట్ చేయడం కొనసాగుతూనే ఉంది.

    inter first year exam will be conducted

    గతేడాది పరీక్షలు రద్దు చేసి ఫస్టియర్‌ విద్యార్థులను సెకండియర్‌కు ప్రమోట్‌ చేశారు. ఈ ఏడాది మళ్లీ వైరస్‌ విజృంభించడంతో మరోసారి పరీక్షలను రద్దు చేస్తే.. పరిస్థితి గందరగోళంగా మారనుంది. ప్రస్తుతం కరోనా ఉధృతి తక్కువగా ఉన్న సమయంలో సెకండియర్‌ విద్యార్థులకు వచ్చే నెలల్లో ఫస్టియర్‌ పరీక్షలు నిర్వహించాలని అనుకుంటున్నారు.

    ప్రశ్నపత్రాలను కూడా సులువుగా ఉండేలా చూడాలని భావిస్తున్నారు. విద్యార్థులు పరీక్ష రాయడానికి ముందు ఫీజు చెల్లించిన వారు మళ్లీ చెల్లించనవసరం లేదు. ఒకవేళ చెల్లించాల్సిన వారు ఇప్పుడు ఫీజు చెల్లించి పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం మరో రెండుమూడు రోజుల్లో స్పష్టత ఇవ్వనుంది. తర్వాత పరీక్షల నిర్వహణపై క్లారిటీ వస్తోంది. కరోనా వల్ల కేజీ నుంచి ఇంటర్ వరకు అందరినీ ప్రమోట్ చేస్తున్నారు. సీబీఎస్ఈ కూడా అలానే ఉంది. ఎంట్రెన్స్ ఎగ్జామ్ మాత్రం నిర్వహిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+