హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బతుకమ్మ: ఈ సారి రెండురోజులు, బుధ/ గురువారాలు.. ఎందుకంటే..

|
Google Oneindia TeluguNews

పూల పండగ.. బతుకమ్మ తుది అంకానికి చేరింది. ఇవాళ/ రేపు సద్దుల బతుకమ్మకు తెలంగాణ రాష్ట్రం సిద్దమయ్యింది. గత 9 రోజులుగా ఆడపడుచులు బతుకమ్మ ఆడుతున్నారు. తొమ్మిదోరోజు సద్దుల బతుకమ్మ వేడుకలకు ప్రతి గడప సిద్ధమైంది. సంప్రదాయం, అనుబంధం చాటుతూ, సద్దుల వేడుకలో అందరూ పాల్గొంటున్నారు. ఎంగిలిపూలతో మొదలై, సద్దులతో బతుకమ్మ ముగుస్తోంది.

9 రోజులు ఇలా..

9 రోజులు ఇలా..

రెండోరోజు అటుకుల బతుకమ్మ, మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగోరోజు నానబియ్యం బతుకమ్మ, ఐదోరోజు అట్ల బతుకమ్మ పేరుతో ఉయ్యాల పాటలతో... బతుకమ్మను కొలుస్తారు. ఆరోరోజు అర్రెం నాడు బతుకమ్మ ఆడరు. అలిగిన బతుకమ్మ అని కూడా చెబుతుంటారు. ఏడోరోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ తర్వాత.. తొమ్మిదోరోజు సద్దుల బతుకమ్మ ఆడతారు. దీంతో బతుకమ్మ పండగ ముగుస్తోంది. సద్దులు చేసి.. చెరువు వరకు పాటల పాడుతూ వెళ్లి.. నిమజ్జనం చేస్తారు.

పండగ సందడి

పండగ సందడి

సద్దుల బతుకమ్మ రోజున తెలంగాణ ఇళ్లు, వాకిళ్లలో ఉండే సందడి అంతా ఇంతా కాదు. గునుగు, తంగేడు, చామంతి, బంతి, మందార, కనకాంబరం, గులాబీ, పట్టుకుచ్చుల పువ్వులను సేకరిస్తారు. గుత్తులు కట్టి బతుకమ్మ పేరుస్తారు. దారంతో కట్టిన గునుగు పూల గుత్తులను రంగుల్లో అద్ది బతుకమ్మకు అందాలు అద్దుతారు. గుమ్మడి పువ్వు లేదా పసుపుతో గౌరమ్మను పెట్టి మంగళహారతులు, అగరుబత్తులు వెలిగించి కొలుస్తారు. సాయంకాలం బతుకమ్మ ఆటలు ఆడి పాటలు పాడి.. పోయిరావమ్మా బతుకమ్మ అంటూ సాగనంపుతారు.

రెండు రోజులు బతుకమ్మ

రెండు రోజులు బతుకమ్మ


రాష్ట్రంలో ఈసారి బుధ, గురు వారాల్లో సద్దుల బతుకమ్మ నిర్వహిస్తున్నారు. కొన్నిప్రాంతాల్లో బుధవారం.. మరికొన్ని ప్రాంతాల్లో గురువారం పండగను చేస్తున్నారు. తెలంగాణ విద్వత్సభ, జ్యోతిష పండితులు, పూజారులు వేర్వేరు తేదీలు ప్రకటించడంతో... స్థానిక సంప్రదాయం ప్రకారం అదే పద్ధతిని ప్రజలు ఫాలో కావాల్సి వస్తోంది. వేములవాడ, కొండపాక సహా.. పలు ప్రాంతాల్లో బతుకమ్మను 7 రోజులు, 11, 13 రోజులు ఆడే సంప్రదాయం కూడా ఉంది. ఎక్కువ మంది ప్రజలు మాత్రం ఏటా 9 రోజులకే బతుకమ్మ వేడుకలను ముగిస్తారు.

Recommended Video

Spl Interview with Bhagyanagar Temple Pujari || Oneindia Telugu
పాటలు

పాటలు


మరోవైపు ఉద్యోగాలకు సంబంధించి బతుకమ్మ పాట ఒకటి వైరల్ అయ్యింది. మరో పాటలో ఈటలకు ఓటు వేయాలని ట్రోల్ చేస్తున్నారు. దీనికి కౌంటర్‌గా టీఆర్ఎస్ కూడా మరో సాంగ్ ట్రై చేసింది. మరోవైపు తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో అల్లిపూల వెన్నెల బతుకమ్మ పాటను తీశారు. గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేయగా.. ఏఆర్ రహమాన్ స్వరాలు సమకూర్చారు. ఆ పాటను నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, డైరెక్టర్ గౌతమ్ మీనన్‏తో కలిసి విడుదల చేశారు. అల్లిపూల వెన్నెల సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంటుంది. తన మ్యూజిక్ మాయతో ఏఆర్ రహమాన్.. గౌతమ్ మీనన్ ప్రేక్షకులను మాయ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండగ బతుకమ్మ. రకరకాల పువ్వులను పేర్చి... అమ్మవారిగా తలచి పూజిస్తూ.. ఆడుతూ పాడుతూ జరుపుకునే ఈ పండగను సంబరంగా జరుపుకుంటారు. జాగృతి రూపొందించిన పాటపై కాస్త విమర్శలు వచ్చాయి. ఇంత ప్రతిష్టాత్మకంగా తీసిన.. ఇక్కడి రుచి, వాసన లేదని పెదవి విరుస్తున్నాయి. నిజానికి పాటలో తెలంగాణం ఎక్కడ కనిపించలేదు కూడా.. పాట కూడా స్లోగా ఉండటం కాస్త నిరాశకు గురిచేసింది.

English summary
this year saddula bathukamma two days because priests says different types of date.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X