హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షర్మిల నిరుద్యోగ దీక్ష కూడా వాయిదా.. ఆ కారణంతోనే..

|
Google Oneindia TeluguNews

గులాబ్ తుపాన్ ఎఫెక్ట్ ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు/ స్కుళ్లకు సెలవు ప్రకటించారు. అయితే రేపు (మంగళవారం) నిర్వహించే రాజకీయ వేదిక/ సభలు, సమావేశాలు, దీక్షలు కూడా వాయిదా పడుతున్నాయి. ప్రతీ మంగళవారం వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల నిరుద్యోగ నిరహార దీక్ష చేపడుతున్నారు. ఈ సారి కూడా డిచ్ పల్లిలో చేపట్టేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ వాతావరణమే సహకరించడం లేదు. దీంతో దీక్షను కూడా వాయిదా వేశారు. ఈ మేరకు వైఎస్ఆర్ టీపీ పార్టీ ప్రకటించింది.

దీక్ష వాయిదా..

దీక్ష వాయిదా..

నిరుద్యోగుల‌ కోసం నిరాహారదీక్ష కార్యక్రమం కూడా వాయిదా పడింది. ఉదయం 10:00 గంటలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో దీక్ష చేపడతామని ప్రకటించారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేశారు. ఉద‌యం 10:00 గంటలకు యూనివ‌ర్సిటీ ఆవ‌ర‌ణ‌లో మీడియాతో మాట్లాడిన అనంత‌రం సాక్షి కార్యాల‌యం స‌మీపంలో ఏర్పాటు చేసిన దీక్ష ప్రాంగ‌ణంలో వైఎస్ షర్మిల "నిరుద్యోగ నిరాహార దీక్ష" చేపట్టాల్సి ఉంది. కానీ చివరి క్షణంలో రద్దు చేశారు. వర్షాల వల్ల ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వాయిదా వేశారు. మళ్లీ వచ్చే మంగళవారం ఇక్కడే నిరుద్యోగ నిరహార దీక్ష చేపడుతామని పార్టీ ప్రకటించింది.

వర్ష బీభత్సం..

వర్ష బీభత్సం..

తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో.. ముఖ్యంగా హైదరాబాద్‌లో సోమవారం, మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండేలా అధికారుల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. తుఫాన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు కంట్రోల్‌ రూమ్ 040-23202813 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. హైదరాబాద్‌లో కురుస్తోన్న వర్షాలతో నగరమంతా జలమయమైంది. దీంతో రోడ్లన్నీ ట్రాఫిక్ తో నిండిపోయాయి. దారులన్నీ మూసుకుపోవడంతో ప్రజలు ఇళ్లకు చేరడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆగిపోయిన నీటిని క్లియర్ చేసేందుకు డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ టీమ్స్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మ్యాన్ హోల్స్ వంటివి ఓపెన్ అయి ఉంటాయని గమనించి రోడ్డుపై ప్రయాణించాలని వాహనదారులకు, పాదచారులకు అధికారులు సూచిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా..

రాష్ట్రవ్యాప్తంగా..


హైదరాబాద్‌ అంతా భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానతో పలు ప్రాంతాల్లోని రోడ్లపైకి, కాలనీల్లోకి వరద నీరు చేరింది. హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో చీకటి అలుముకుంది. పట్టపగలే కారు చీకటి అలముకుంది. కుండపోతగా వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తెలంగాణలోని 14 జిల్లాల్లో వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జోన్‌లో ఉన్నాయి. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు.

English summary
ysrtp president ys sharmila deeksha also postponed due to heavy rains in the state. telangana government also issue red alert for rains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X