హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ షర్మిల చేతికి గాయం, పోలీసులపై విజయలక్ష్మీ ఆగ్రహాం

|
Google Oneindia TeluguNews

వైఎస్ షర్మిల దీక్ష భగ్నం కావడం హై టెన్షన్‌కు దారితీసింది. దీక్ష భగ్నం తర్వాత లోటస్ పాండ్ వరకు పాదయాత్ర చేపట్టారు. దానిని పోలీసులు ఆపే క్రమంలో దురుసుగా ప్రవర్తించారు. ఇందిరా పార్క్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన వెంటనే పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. పాదయాత్ర కొనసాగించేందుకు యత్నించగా పోలీసుల దురుసు ప్రవర్తనతో స్పృహతప్పి పడిపోయారు. షర్మిల చేయికి బలమైన గాయమైంది. దీంతో లోటస్‌పాండ్‌కు ప్రత్యేక వైద్యబృందం చేరుకుంది.

షర్మిలకు పరీక్షలు నిర్వహిస్తోంది. మరోవైపు లోటస్‌పాండ్‌కు షర్మిల అభిమానులు భారీగా చేరుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా అభిమానుల నినాదాలు చేస్తున్నారు. తనకు గాయం కావడంతో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టబోనని షర్మిల ప్రతినబూనారు. తనను గాయపరిచారని, మరోసారి చేయిపడితే ఊరుకోబోనని షర్మిల హెచ్చరించారు. అంతకుముందు షర్మిలను అరెస్ట్ చేసి బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత షర్మిల లోటస్‌పాండ్‌లో దీక్ష కొనసాగిస్తున్నారు.

ys sharmila hand wounded

తెలంగాణ ప్రజల కోసం షర్మిల నిలబడిందని విజయలక్ష్మీ తెలిపారు. షర్మిల పోరాటం కొనసాగుతుందని ఆమె చెప్పారు. తెలంగాణలో ఉద్యోగాలు లేక ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే పోలీసులు దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. షర్మిల దీక్షను గౌరవిస్తే ప్రభుత్వానికి గౌరవంగా ఉండేదన్నారు. పోలీసులు హింసాయుతంగా ప్రవర్తిస్తే ఆందోళనలు ఉధృతమవుతాయని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని విజయలక్ష్మీ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయాలనే డిమాండ్‌తో ధర్నాచౌక్‌లో వైఎస్ షర్మిల దీక్ష చేపట్టారు. ఆమెకు ప్రజా సంఘాలు, మేధావుల నుంచి మద్దతు లభించింది. రచయిత కంచె ఐలయ్య కూడా మద్దతు పలికారు.

English summary
ys sharmila hand wounded in the arrest time
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X