స్త్రీల లోదుస్తులు వేసుకున్న సైకో: బెంగళూరు నైస్ రోడ్డులో మిసెస్ ఇండియాకు చిత్రహింసలు !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: ఒంటరిగా రోడ్డు మీద ఉన్న ప్రముఖ మోడల్ ను ఓ సైకో చిత్రహింసలు పెట్టాడు. మహిళల లోదుస్తులు వేసుకుని, పెదవులకు లిప్ స్టిక్ వేసుకుని మోడల్ చెయ్యి పట్టుకుని పక్కకు లాగి నానా హంగామా చేశాడని బాధితురాలు ఆవేదన చెందారు.

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మిసెస్ ఇండియా కిరీటం దక్కించుకున్న ప్రముఖ మోడల్ రాజ్యశ్రీ ఈనెల 6వ తేదీన ఆదివారం బెంగళూరు నైస్ రోడ్డులో తన భర్త కోసం ఎదురు చూస్తున్నారు. ఆదివారం కావడంతో జనసంచారం అంతంతమాత్రంగానే ఉంది.

A psycho man harassed model bengalurus nice road

ఆ సమయంలో మహిళల లోదుస్తులు వేసుకున్న ఓ సైకో అటువైపు వెళ్లాడు. విచిత్రంగా ప్రవర్థిస్తున్న అతన్ని రాజ్యశ్రీ గమనించారు. తరువాత ఒక్క సారిగా రాజ్యశ్రీ దగ్గరకు వెళ్లిన సైకో ఆమె చెయ్యి పట్టుకుని పక్కకు లాగడానికి ప్రయత్నించాడు.

రాజ్యశ్రీని ఎత్తుకు వెళ్లాలని ప్రయత్నించడంతో ఆమె గట్టిగా కేకలు వేశారు. పరిసర ప్రాంతాల్లో ఎవ్వరూ లేకపోవడం, అటు వైపు వాహనాలు రాకపోవడంతో రాజ్యశ్రీ కేకలు ఎవ్వరికీ వినిపించలేదు. తరువాత సైకో రాజ్యశ్రీ పట్ల అసభ్యంగా ప్రవర్థించాడు.

సైకో ప్రవర్తనతో విసిగిపోయిన రాజ్యశ్రీ పోలీసులకు ఫోన్ చెయ్యడానికి ప్రయత్నించడంతో అతను ఆమెకు దూరంగా వెళ్లాడు. అతని విచిత్ర ప్రవర్తన మొబైల్ లో చిత్రీకరించాలని ప్రయత్నించడంతో సైకో అక్కడి నుంచి పారిపోయాడని రాజ్యశ్రీ సోషల్ మీడియాలో తనకు జరిగిన ఘటన వివరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు నైస్ రోడ్డులో సైకో ఎమైనా కనిపిస్తాడా అని గాలిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A psycho man harassed a model in Bengaluru's nice road. Man wearing woman's intimate cloths and tryed to harass a model.
Please Wait while comments are loading...