వరకట్నంతో 7 ప్రయోజనాలు: సెయింట్ జోసెఫ్ కాలేజీ వింత పోకడ

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగుళూరు: వరకట్నం వల్ల ఎన్నో లాభాలున్నాయని. బెంగళూరులోని ఓ కాలేజీ కట్నంతో ఏడు ప్రయోజనాలంటూ పాఠాలు చెప్పడం వివాదాస్పదమైంది. ఈ కాలేజీ వ్యవహరం కర్ణాటక రాష్ట్రంలో హట్‌టాపిక్‌గా మారింది.

వరకట్నం ఇచ్చినా... తీసుకున్నా, ఇచ్చినా నేరమేనని ప్రభుత్వం చెబుతున్న మాట. కానీ, వరకట్నం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని బెంగుళూరులోని ఓ కార్పోరేట్ కాలేజీ పాఠాలు చెబుతోంది.

Advantages of Dowry’ leaves college red-faced

వరకట్నం దురాచారమని సమాజం మొత్తం దానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే, వరకట్నాన్ని సమర్థిస్తూ కాలేజీల్లో పాఠాలు చెబుతున్నారా? కట్నం తీసుకుంటే ఎన్నో లాభాలు, మరెన్నో ప్రయోజనాలంటూ ఓ సిలబస్ కాపీ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.

అందంగాలేని అమ్మాయిలకు కట్నం ఇస్తేనే పెళ్లిళ్లు అవుతాయి. ఇలా ఒకటి రెండు కాదు.. వరకట్నంవల్ల ఏడు ప్రయోజనాలంటూ ఓ కాలేజీ పాఠ్యాంశాల్లో చేర్చడం సంచలనంగా మారింది. అయితే ఈ వ్యవహారం బయటకు రావడంతో ఇప్పుడు రచ్చ రచ్చ అయింది.

బెంగళూరులో టాప్ సెంట్ జోషెఫ్ కాలేజీ. ఆ కాలేజీ సోషియాలజీ పాఠ్య పుస్తకాల్లో వరకట్నం, దాని ప్రయోజనాలంటూ ఉన్న ఓ పేజీ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సామాజిక రుగ్మత అయిన వరకట్నం నిషేధం కోసం ఎన్నో ఉద్యమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయి. ఓ వైపు కట్నం తీసుకోవద్దంటూ ప్రచారం జరుగుతుంటే, కాలేజీలో కట్నం గురించి లాభాలు చెప్పడం కలకలం రేపింది.

వరకట్నం తీసుకోవడం వల్ల అధిక ప్రయోజనాలంటూ ఆ కాలేజీ విద్యార్ధులకు చెబుతోంది. వాటికి లాజిక్‌లు కూడా చెబుతోంది. దీంతో విద్యార్థులకు పాఠాలు చెప్పేది ఇలాగేనే అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. వరకట్నాన్ని సమర్ధించేలా ఉన్న పేజీని ఓ విద్యార్థిని ఫోటో తీసి ఫేస్ బుక్‌లో పెట్టింది. దీంతో ఇది వైరల్ అయింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sociology lessons rarely make headlines. But, on Friday, a lesson on dowry from a reference book at a city college was going viral for its embarrassingly misogynistic content. Few hours of trolling later, the college has decided to pull out the reference book from its library.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి