కమల్ హాసన్, రజనీకాంత్: ఎవరు, ఇరువురికి తేడా, పోలిక?

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి స్పష్టమైన ప్రకటన చేశారు. అంతకు ముందే మరో స్టార్ కమల్ హాసన్ తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు చెప్పారు.

కమల్ హాసన్ ప్రకటనతో రజనీకాంత్ వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు ఎవరి సత్తా ఎంత, ఎవరు నెగ్గురుతారనే చర్చ సాగుతోంది. ఇరువురికి మధ్య ఉన్న పోలికలపై, తేడాలపైకూడా చర్చ సాగుతోంది.

 సూపర్ స్టార్ రజనీకాంత్‌లో ఆత్మవిశ్వాసం

సూపర్ స్టార్ రజనీకాంత్‌లో ఆత్మవిశ్వాసం

రజనీకాంత్ మాటల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. యుద్ధంలోకి దిగితే గెలిచి తీరాల్సిందేనని ఆయన అన్నారు. తాను యుద్ధరంగంలోకి దిగుతున్నట్లు చెప్పారు. బిజెపి రజనీకాంత్ వెనక ఉందని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా రజనీకాంత్‌కు బిజెపి మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు.

కమల్ హాసన్ ఇలా చేశాడు...

కమల్ హాసన్ ఇలా చేశాడు...

63 ఏళ్ల కమల్ హాసన్ తాను రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్లు గత వారం ప్రకటించారు. ఆ దిశగా చేసే ప్రయాణంలో జనవరిలో మొబైల్ యాప్‌ను ప్రారంభించనున్నారు. కమల్ హాసన్‌ను క్లాస్‌గాను, రజనీకాంత్‌ను మాస్‌గానూ చెబుతుంటారు. కమల్ హాసన్ అభిమానులే అలా చెబుతుంటారు.

 కమల్ హాసన్‌ను తమిళుడిగా...

కమల్ హాసన్‌ను తమిళుడిగా...

కమల్ హాసన్ రామంతపురంలో జన్మించారు. ఆయనను తమిళుడిగా భావిస్తుంటారు. రజనీకాంత్‌ స్థానికుడు కాదని, కర్ణాటకకు చెందినవాడని అంటారు. ఇది రజనీకాంత్‌కు కొంత వ్యతిరేకంగా పనిచేస్తుందనే భావన ఉంది. అయితే, బెంగుళూరులో జన్మించిన జయలలిత ముఖ్యమంత్రి కాలేదా అని రజనీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

 జయలలిత మరణంతో ఇద్దరు...

జయలలిత మరణంతో ఇద్దరు...

జయలలిత మరణంతో తమిళనాడు రాజకీయాల్లో శూన్యత ఏర్పడిందనే భావన ఉంది. ఈ శూన్యతలో రాజకీయాల్లో తమ సత్తా చాటాలని కమల్ హాసన్, రజనీకాంత్ భావిస్తున్నారు. ఎంజి రామచంద్రన్, జయలలిత మాదిరిగానే సినిమా ఇమేజ్ తమకు కలిసి వస్తుందని వారు భావిస్తున్నారు.

 ఇద్దరు ఇలా...

ఇద్దరు ఇలా...

తనను తాను కమల్ హాసన్ నాస్తికుడిగా, హేతువాదిగా చెప్పుకుంటారు. తన రంగు కాషాయం కాదని ప్రకటిస్తారు. రజనీకాంత్‌కు ఆధ్యాత్మిక భావన ఎక్కువ. రజనీకాంత్ ఆధ్యాత్మిక భావనలు బిజెపి సిద్ధాంతాలకు అనుకూలంగా ఉంటాయని అంటారు.

 కమల్ ఇలా.. రజనీ అలా..

కమల్ ఇలా.. రజనీ అలా..

కమల్ హాసన్ కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతారు. రజనీకాంత్ ఆచితూచి మాట్లాడుతారు. ఎక్కువ మాట్లాడరు. రాజకీయాలు ఎంత కష్టమో తనకు తెలుసునని, అందువల్ల జాగ్రత్త, పథకం ప్రకారం వ్యవహరించడం ముఖ్యమని రజనీకాంత్ నమ్ముతారు.

 ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో...

ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో...

కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి చాలా సినిమాల్లో నటించారు. 1970 దశకంలో వారు నటించిన చాలా సినిమాలు ప్రజాదరణ పొందాయి. కమల్ హాసన్ హీరోలాంటి స్ట్రెయిట్ పాత్రలు చేస్తే, రజనీకాంత్ కాస్తా విలనిజం ఉన్న స్టైలిష్ పాత్రలు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Politics has been swirling around Rajinikanth and Kamal Haasan, both adored as legends, but both with distinctly different styles that could extend to their political appeal.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి