వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ, మన్మోహన్ షేక్‌హ్యాండ్, నవ్వులు!: కేంద్రమంత్రులతో రాహుల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పరస్పరం విమర్శలు గుప్పించుకున్న విషయం తెలిసిందే. అయితే, పాకిస్థాన్ అధికారులతో రహస్యంగా సమావేశమయ్యారని మోడీ విమర్శిస్తే.. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ దేశానికే విపత్తు అని మన్మోహన్ వ్యాఖ్యానించారు.

కాగా, పార్లమెంటు ఆవరణలో బుధవారం ఎదురుపడ్డ ప్రధాని మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లు కరచాలనం చేసుకుని, నవ్వుకుంటూ మాట్లాడుకోవడం గమనార్హం. 2001లో పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించే కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది.

 After war of words, PM Modi shakes hands with Manmohan Singh

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్, రవిశంకర్ ప్రసాద్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, నూతన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తోపాటు పలువురు సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరై నివాళులర్పించారు.

ఈ సందర్భంగానే మోడీ, మన్మోహన్ సింగ్ ఎదురుపడ్డారు. కరచాలనం చేసుకుని పలకరించుకున్నారు. కాగా, కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్, రవిశంకర్ ప్రసాద్.. రాహుల్ గాంధీతో నవ్వుతూ మాట్లాడుకోవడం కనిపించింది. కాగా, 2001, డిసెంబర్ 13న పార్లమెంటుపై జరిగిన దాడిలో భద్రతా సిబ్బందితోపాటు 9మంది ప్రాణాలు కోల్పోయారు.

English summary
Days after a bitter war of words Prime Minister Narendra Modi shook hands with former PM Manmohan Singh at Parliament House in New Delhi on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X