వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆక్సిజన్ డిమాండ్‌పై ఢిల్లీ సర్కార్‌కు ఊరట- ఎయిమ్స్‌ ఛీఫ్‌ క్లారిటీతో

|
Google Oneindia TeluguNews

కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో ఢిల్లీలో నాలుగురెట్లు ఆక్సిజన్‌ డిమాండ్‌ను కృత్రిమంగా పెంచారని కేజ్రివాల్ సర్కార్‌ ఆరోపణలు ఎధుర్కొంటోంది. తాజాగా నిర్వహించిన ఆడిట్‌లో ఈ విషయం బయటపడటంతో ఢిల్లీ సర్కార్‌కూ, కేంద్రానికీ మధ్య మరో వార్ మొదలైంది. దీంతో ఈ వ్యవహారంపై మాటలయుద్ధం కొనసాగుతోంది.

ఢిల్లీలో కృత్రిమంగా ఆక్సిజన్‌ డిమాండ్‌ పెంచారన్న విమర్శలపై ఇవాళ ఢిల్లీ ఎయిమ్స్‌ ఛీఫ్ రణ్‌దీప్‌ గులేరియా స్పందించారు. అలా అని కచ్చితంగా చెప్పలేమని ఆయన తెలిపారు. ఆక్సిజన్‌ డిమాండ్‌పై ఆడిట్‌ నిర్వహించిన టీమ్‌లో సభ్యుడిగా కూడా ఉన్న ఎయిమ్స్ ఛీఫ్‌ గులేరియా.. ఢిల్లీ ఆక్సిజన్‌పై వెలువడింది మధ్యంతర నివేదిక మాత్రమేనని, తుది నివేదిక ఇంకా రావాల్సి ఉందని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉందని, కోర్టు ఏం చెబుతుందో చూడాలని గులేరియా వ్యాఖ్యానించారు.

aiims chief clarified on delhis oxygen demand exggaration, says cant confirm

ఢిల్లీలోని కేజ్రివాల్‌ సర్కార్‌ కరోనా సమయంలో నాలుగు రెట్లు ఆక్సిజన్‌ డిమాండ్‌ పెంచిందంటూ బీజేపీకి సన్నిహితంగా ఉండే కొందరు మీడియాకు లీకులు ఇచ్చారు. దీనిపై విమర్సలు రావడంతో స్పందించిన కేజ్రివాల్‌ సర్కార్‌.. ఈ నివేదిక దురుద్ధేశంతో కూడుకున్నదని మండిపడింది. ఆ తర్వాత స్పందించిన కేంద్రం.. ఇది మధ్యంతర నివేదిక మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. ఇవాళ ఢిల్లీ ఎయిమ్స్‌ ఛీఫ్‌ గులేరియా కూడా అదే చెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగినట్లయింది.

English summary
delhi aiims chief ranadeep guleria on today clarified that he can't say the delhi govt has exggarated the oxygen demand during the covid 19 second wave.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X