వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్లీన్ ఇండియా ప్రచారకర్తగా బిగ్‌బి: చీపురుతో (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ముంబై: దేశంలో పోలియో నిర్మూలన కోసం గతంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఇప్పుడు మరో బృహత్తర కార్యక్రమానికి ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. ఇక మీదట ఆయన పరిశుభ్ర భారత్‌ను తయారు చేయడం కోసం ప్రచారం చేయనున్నారు.

అమితాబ్ ‘బనేగా స్వచ్ఛ్ ఇండియా' ప్రచార కార్యక్రమం అంబాసిడర్‌గా నియమితులయ్యారు. శుక్రవారం ముంబైలో ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అమితాబ్ మాట్లాడారు. గత కొంతకాలంగా పారిశుద్ధ్యంపై ప్రచార కార్యక్రమం చేయాలనుకుంటున్నానని, ఇప్పుడు అవకాశం వచ్చిందని అన్నారు. ఇక నుంచి తానూ ఈ ప్రచారంలో భాగస్వామినవుతానని చెప్పారు.

అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్

దేశంలో పోలియో నిర్మూలన కోసం గతంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఇప్పుడు మరో బృహత్తర కార్యక్రమానికి ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. ఇక మీదట ఆయన పరిశుభ్ర భారత్‌ను తయారు చేయడం కోసం ప్రచారం చేయనున్నారు.

రవిశంకర్ ప్రసాద్

రవిశంకర్ ప్రసాద్

కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చీపురు పట్టారు. ‘క్లీన్ ఇండియా' కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ.. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని శాస్త్రీ భవన్ వద్ద ఆయన చీపురుతో ఊడ్చారు.

స్మృతీ ఇరానీ

స్మృతీ ఇరానీ

పరిశుభ్ర భారత్ కార్యక్రమంలో భాగంగా చీపురు పట్టిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ.

స్మృతీ ఇరానీ

స్మృతీ ఇరానీ

పరిశుభ్ర భారత్ కార్యక్రమంలో భాగంగా తోట్టీలకు మెరుగులు దిద్దుతున్న కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ.

శ్రీపాద్ యసో నాయక్

శ్రీపాద్ యసో నాయక్

పరిశుభ్ర భారత్ కార్యక్రమంలో భాగంగా చీపురు పట్టి రోడ్డు శుభ్రం చేస్తున్న కేంద్రమంత్రి శ్రీపాద్ యసో నాయక్.

తన తండ్రి పరిశుభ్రత విషయంలో ఎంతో కఠినంగా ఉండేవారని అమితాబ్ గుర్తు చేసుకున్నారు. ఆయన నుంచే తనకు పరిశుభ్రత అలవాటుగా మారిందని తెలిపారు. ఇప్పుడు కూడా ఇంట్లో తన వల్ల ఏదైనా పొరపాటు జరిగితే ఎవ్వరినీ సహాయం కోరకుండా తానే శుభ్రం చేస్తానని చెప్పారు. తాను ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తానని అమితాబ్ బచ్చన్ తెలిపారు.

చీపురు పట్టిన మరో కేంద్రమంత్రి

ఢిల్లీ: కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చీపురు పట్టారు. ‘క్లీన్ ఇండియా' కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ.. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని శాస్త్రీ భవన్ వద్ద ఆయన చీపురుతో ఊడ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘క్లీన్ ఇండియా' అనేది స్వచ్ఛమైన భారత్ కోసం ఉద్యమమని అభివర్ణించారు. ఓ మంత్రితోపాటు అధికారులు కూడా చీపురు పట్టడం మంచి సందేశమని అన్నారు.

English summary
Megastar Amitabh Bachchan, who successfully led the campaign to eradicate Polio from the country, has now lent his support to the cleanliness drive ‘Banega Swachh India’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X