వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి ఔట్: టెన్త్ బోర్డ్‌ పరీక్షలో జవాబు 'లేని' ప్రశ్న!

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: ‘జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో పీడీపీ ప్రభుత్వంతో పొత్తులో ఉన్న పార్టీ ఏదీ?' అని ప్రశ్నిస్తే.. తెలిసినవారు ఎవరైనా సమాధానం భారతీయ జనతా పార్టీ అనే చెబుతారు. అదే ప్రశ్నకి నాలుగు సమాధానాలు ఇచ్చి.. అందులో సరైనది ఎంచుకోవాలని చెప్పి.. ఆ సమాధానాల్లో బిజెపి లేకపోతే ఏం చేస్తారు? ఏం చెబుతారు.

ఇలాంటి చిక్కే ఎదురైంది జమ్మూకాశ్మీర్‌ పదవ తరగతి విద్యార్థులకు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో పదోతరగతి విద్యార్థులకు బోర్డ్‌ పరీక్షలు జరిగాయి. ఆ పరీక్షల్లో గత మార్చిలో పీడీపీ ప్రభుత్వంతో పొత్తు కుదుర్చుకున్న పార్టీ ఏది? అన్న ప్రశ్న వచ్చింది.

Answer options in exam skips BJP for coalition partner in Jammu and Kashmir

కానీ ఆ ప్రశ్నకు ఇచ్చిన సమాధానాల్లో కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), పిడిఎఫ్ మరో ప్రాంతీయ పార్టీల పేర్లు పొందుపరిచారు.

అసలు పీడీపీతో పొత్తులో ఉన్న బిజెపి మాత్రం ఆప్షన్స్‌లో కనిపించలేదు. ఈ విషయంపై ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టినట్లు తెలిపారు. కాగా, తప్పుగా వచ్చిన ప్రశ్నకు ఒక మార్క్ కలిసేలా చూడాలని 10వ తరగతి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

English summary
In an embarrassment for the Jammu and Kashmir government, a question in an examination paper of class X asked students to name the alliance partner that formed the coalition along with PDP in the state but did not mention BJP as one of the four options.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X