వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ బయోటెక్ కోవాక్సిన్ దరఖాస్తు ... డబ్ల్యూహెచ్ఓ పరిశీలనకు ఆమోదం, జూన్ 23న సమావేశం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ వచ్చే బుధవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తో సమావేశాన్ని నిర్వహించనుంది. భారతదేశంలో తయారు చేసిన కోవిడ్ -19 వ్యాక్సిన్ కోవాక్సిన్ ఇతర దేశాలలో వినియోగించటం కోసం ఆమోదం పొందడానికి జూన్ 23 న ప్రపంచ ఆరోగ్య సంస్థతో సమావేశం కానుంది . మూడవ దశ క్లినికల్ ట్రయల్ డేటా లేనందున కొన్ని విదేశీ దేశాలలో కోవాక్సిన్ ఆమోదం పొందడంలో అడ్డంకులను ఎదుర్కొంటోంది.

వ్యాక్సిన్ విదేశాలకు ఎగుమతి చెయ్యటానికి అనుమతి కోరిన భారత్ బయోటెక్

వ్యాక్సిన్ విదేశాలకు ఎగుమతి చెయ్యటానికి అనుమతి కోరిన భారత్ బయోటెక్

భారత్ బయోటెక్ తమ టీకాను ఎగుమతి చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తప్పని సరి కావడంతో విదేశాల్లో వినియోగం కోసం డబ్ల్యూహెచ్వో కు దరఖాస్తు చేసుకుంది . ఈ దరఖాస్తును పరిశీలించడానికి డబ్ల్యుహెచ్వో ఆమోదం తెలిపింది. అయితే సమగ్ర సమాచారం లోపించిందని డబ్ల్యూహెచ్ఓ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరిన అదనపు సమాచారాన్ని సైతం భారత్ బయోటెక్ సమర్పించింది. దీంతో భారత్ బయోటెక్ దరఖాస్తు పరిశీలనకు మార్గం సుగమమైంది.

 జూన్ 23వ తేదీన భారత్ బయోటెక్ కీలక సమావేశం

జూన్ 23వ తేదీన భారత్ బయోటెక్ కీలక సమావేశం

ఇక ఈ నెల 23వ తేదీన జరగనున్న కీలక సమావేశంలో భారత్ బయోటెక్ తమ డేటాను ప్రపంచ ఆరోగ్య సంస్థతో పంచుకోనుంది. ఈ ప్రక్రియ పూర్తయితే అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. అయితే భారత్ బయోటెక్ మాత్రం గతంలోనూ తమ సంస్థ తయారు చేసిన అనేక వ్యాక్సిన్ లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి లభించిందని, కోవాక్సిన్ విషయంలో కూడా అనుమతి తప్పనిసరిగా లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

జులైలో 3వ దశ క్లినికల్ ట్రయల్స్ డేటా ఇస్తామని వెల్లడి

జులైలో 3వ దశ క్లినికల్ ట్రయల్స్ డేటా ఇస్తామని వెల్లడి

ఇదిలా ఉంటే జూలైలో కోవాక్సిన్ యొక్క ఫేజ్ -3 ట్రయల్ డేటాను పబ్లిక్ చేస్తామని భారత్ బయోటెక్ గతంలో పేర్కొంది. దీని తరువాత భారతదేశంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ యొక్క పూర్తి లైసెన్స్ కోసం కంపెనీ దరఖాస్తు చేయనుంది. వ్యాక్సిన్ల యొక్క "వాస్తవ-ప్రపంచ ప్రభావాన్ని" తనిఖీ చేయడానికి మరియు భద్రత , సమర్థత కోసం శాస్త్రీయంగా ఆమోదించబడిన ప్రమాణాలకు అనుగుణంగా ఫేజ్ -4 ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం, వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ అత్యవసర ఉపయోగం కోసం అధికారం ఇచ్చారు.

కొత్త వేరియంట్ లకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ల అభివృద్ధి

కొత్త వేరియంట్ లకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ల అభివృద్ధి

వ్యాక్సిన్ ల ఉత్పత్తి, అభివృద్ధి, క్లినికల్ ట్రయల్స్ మరియు కోవాక్సిన్ కోసం ఉత్పాదక సదుపాయాల ఏర్పాటు కోసం సంస్థ తన సొంత వనరుల నుండి కనీసం ₹ 500 కోట్ల పెట్టుబడి పెట్టింది. కంపెనీ ప్రకారం భారతదేశంలో ఇప్పటివరకు కనీసం 40 మిలియన్ మోతాదుల కోవాక్సిన్ సరఫరా చేయబడింది . కొత్త వేరియంట్‌లకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ల అభివృద్ధికి ఉత్పత్తి ,అభివృద్ధి కార్యకలాపాలు కూడా కొనసాగుతున్నట్లు గా భారత్ బయోటెక్ వెల్లడించింది.

English summary
Hyderabad-based vaccine manufacturer Bharat Biotech will hold its pre-submission meeting with the World Health Organization (WHO) next Wednesday, i.e. on June 23 regarding the approval of Covaxin, its India-made Covid-19 vaccine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X