ప్రేయసితో కలిసి కొడుకును అపహరించిన సినిమా నటుడు

Posted By:
Subscribe to Oneindia Telugu

ఢిల్లీ: ఓ సినీనటుడు తన ప్రేయసితో కలిసి కన్న కొడుకునే కిడ్నాప్ చేసిన ఘటన ఢిల్లీలో సంచలనం రేపింది. ఢిల్లీలోని లక్ష్మీనగర్‌కు చెందిన భోజ్‌పురి సినిమా నటుడు షాహిద్ (23) ముస్కాన్‌లు భార్యాభర్తలు. వీరికి షెహనాజ్ అనే రెండేళ్ల ఓ కుమారుడున్నాడు.

కుటుంబ వివాదంతో భార్యాభర్తలు విడిపోయారు. ముస్కాన్ మరో వ్యక్తిని పెళ్లాడింది. దీంతో షాహిద్ తన ప్రేయసి సునయన అలియాస్ అలీషాతో కలిసి సహజీవనం చేస్తున్నాడు.

Bhojpuri actor held for kidnapping in Delhi

కోర్టు ఆదేశాల ప్రకారం కొడుకు షెహనాజ్ తల్లి సంరక్షణలో ఉన్నాడు. దీంతో కుమారుడిని చూసేందుకు ముస్కాన్ తన మాజీ భర్త షాహిద్‌ను అనుమతించలేదు.

దీంతో షాహిద్ ఆమెకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. ప్రేయసి అలీషాతో కలిసి కుమారుడినే కిడ్నాప్ చేశాడు. అనంతరం కుమారుడి పట్ల మాజీ భార్య నిర్లక్షం వహించనందువల్లే బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడని షాహిద్ ఆరోపించాడు.

బాలుడి కిడ్నాప్ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు జరిపిన దర్యాప్తులో బాలుడు షెహనాజ్‌ను షాహిద్ తన ప్రేయసితో కలిసి కిడ్నాప్ చేసి తన వద్దే ఉంచుకున్నాడని తేలింది. దీంతో కిడ్నాపర్లు అయిన షాహిద్, అలీషాలను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 23-year-old Bhojpuri actor and his live-in partner were arrested for allegedly kidnapping his two-year-old son to teach his ex-wife a lesson, police said. DCP (southeast) Romil Baaniya said, “On the basis of a tip-off, Mohammad Shahid was nabbed with his live-in partner. The child has been reunited with his mother.”

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి