రాహుల్ జర్మనీ ట్రిప్ పై బీజేపీ విమర్శలు..! ప్రియాంక ఘాటు కౌంటర్..!
పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి మధ్య ఉభయసభలతో పాటు బయటా తీవ్ర మాటల యుద్దం సాగుతోంది. ముఖ్యంగా ఎన్నికల సంస్కరణలు, వందేమాతరం వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇరు కూటముల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేత ఒకరు చేసిన విమర్శలకు ఆయన సోదరి ప్రియాంక గాంధీ ఘాటుగా స్పందించారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో జర్మనీ పర్యటనకు వెళ్లబోతున్న రాహుల్ గాంధీపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఎక్స్ లో విమర్శలకు దిగారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి పార్టీలు చేసుకునే నాయకుడు(లీడర్ ఆఫ్ పార్టీస్), టూర్లు చేసే నాయకుడు (లీడర్ ఆఫ్ టూర్స్) అంటూ ఎగతాళిగా ట్వీట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పార్లమెంట్ బయట స్పందించారు.

Leader of Partying & Paryatan (LoP) pic.twitter.com/8pl9Y2V3nX
— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) December 10, 2025
కాంగ్రెస్ నాయకులు తమ రక్షణ కోసం "అసభ్యకరమైన పనులు" చేస్తున్నారని విమర్శిస్తూ రాహుల్ గాంధీ ఎజెండాను సైతం పూనావాలా ప్రశ్నించారు. మళ్ళీ భారత్ బద్నామి? బీహార్ ఎన్నికల సమయంలో ఆయన ఎక్కడ ఉన్నారు? ఇది మరో సెలవు. సాధారణ ప్రజలు పని సెషన్ల మధ్య సెలవులు తీసుకుంటారు - ఈ వ్యక్తి రెండు సెలవు సెషన్ల మధ్య పనిచేస్తున్నట్లు అనిపిస్తుందన్నారు.

#WATCH | On BJP criticising Lok Sabha LoP and Congress MP Rahul Gandhi's upcoming visit to Germany, Congress MP Priyanka Gandhi Vadra says, "Modi ji spends almost half of his working time outside the country. Why are they raising questions on the Leader of the Opposition's… pic.twitter.com/qrpYOZANXw
— ANI (@ANI) December 10, 2025
దీనిపై ప్రియాంక స్పందిస్తూ.. ప్రధాని మోడీ తన పని సమయంలో దాదాపు సగం దేశం వెలుపల గడుపుతారని, ప్రతిపక్ష నాయకుడి పర్యటన గురించి వారు ఎందుకు ప్రశ్నిస్తున్నారని పూనావాలా పేరెత్తకుండానే నిలదీశారు. మరోవైపు డిసెంబర్ 15 నుండి 20 వరకు రాహుల్ గాంధీ బెర్లిన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సమయంలో ఆయన జర్మన్ ప్రభుత్వ అధికారులను కలవడంతో పాటు అక్కడి భారతీయులతో ముచ్చటిస్తారని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రకటించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19తో ముగియనున్నాయి.
-
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్












Click it and Unblock the Notifications