BJP New President : మరో నాలుగు రోజుల్లో బీజేపీకి కొత్త బాస్? జనవరి 20న ఎలక్షన్
దేశ రాజకీయాల్లో కీలక మలుపుకు బీజేపీ సిద్ధమవుతోంది. జనవరి 20న పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఎంపిక చుట్టూ గట్టిగానే రాజకీయ సస్పెన్స్ నెలకొంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా... పార్టీ వర్గాల్లో ఒకే పేరు గట్టిగా వినిపిస్తోంది- నితిన్ నబిన్.
బీజేపీ హైకమాండ్‌లో ఈసారి ఎలాంటి హడావుడి లేదు. సమావేశాలు, చర్చలు, వడపోతలు అన్నీ నిశ్శబ్దంగానే జరిగిపోయినట్లు సమాచారం. ఈ మేరకు శుక్రవారం బీజేపీ పార్టీ రిటర్నింగ్ అధికారి కె.లక్ష్మణ్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. 19వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ. అదేరోజు సాయంత్రం 5-6 గంటల మధ్య నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఇదంతా బీజేపీ హెడ్ ఆఫీస్ లోనే జరగుతుంది.

అంతర్గత వర్గాల కథనం ప్రకారం... అధ్యక్ష పదవికి ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే, పోటీ లేకుండానే నితిన్ నబిన్ పార్టీ పగ్గాలు చేపట్టడం ఖాయమనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ పరిణామం వెనుక పెద్ద వ్యూహమే ఉందని విశ్లేషకులు అంటున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్టీని తిరిగి పటిష్టం చేయడం, సంస్థాగతంగా మరింత బలంగా తీర్చిదిద్దడం కోసం ఈ ఎంపిక జరిగిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
యువత, కేడర్, రాష్ట్ర నాయకత్వాల మధ్య సమతుల్యం పాటించే నేతగా నితిన్ నబిన్‌కు హైకమాండ్ పూర్తి నమ్మకం ఉందట. అయితే, పార్టీ లోపల మరో కథ కూడా నడుస్తోంది. కొందరు సీనియర్ నేతలు చివరి నిమిషంలో ట్విస్ట్ ఉంటుందేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో చివరి క్షణం వరకూ ఏదైనా జరగొచ్చన్న నానుడి గుర్తు చేస్తూ... జనవరి 20 వరకు ఉత్కంఠ తప్పదంటున్నారు.
మరోవైపు, కొత్త అధ్యక్షుడి ఎంపికతో బీజేపీ భవిష్యత్ దిశ ఏంటి? వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పార్టీ ఎలా సిద్ధమవుతుంది? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఒక్క నిర్ణయంతో పార్టీ వ్యూహం మారబోతుందా? లేక ఇప్పటికే ఖరారైన రోడ్‌మ్యాప్ అమల్లోకి రానుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
మొత్తానికి... బీజేపీలో కొత్త బాస్ ఎన్నిక పైకి ప్రశాంతత కనిపిస్తున్నా, లోపల మాత్రం రాజకీయ వేడి తారస్థాయిలో ఉంది. జనవరి 20న తెరలేచే ఈ కథలో అసలు హీరో ఎవరో తేలాల్సి ఉంది!
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications