బీఎస్ఎన్‌ఎల్ సంచలనం: రూ.499కే మొబైల్ ప్లస్ కనెక్షన్!

ఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.499కే మొబైల్‌, దాంతోపాటు కనెక్షన్ ప్రకటించి సంచలనం సృష్టించింది. ఈ అత్యంత చవకైన మొబైల్‌ ఫోన్ తయారీ కోసం డిటెల్‌ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఈ బండిల్‌ ఆఫర్‌లో వినియోగదారులు రూ.499కే డిటెల్‌ డీ1 మొబైల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ కనెక్షన్‌ పొందుతారు. వ్యాలిడిటీ 365 రోజులు. వాడుకునేందుకు రూ.103 టాక్‌టైమ్‌ లభిస్తుంది.

BSNL, Detel launch Detel D1 feature phone at Rs.499

ఈ డీ1 మొబైల్‌లో 1.44 అంగుళాల తెర, 650 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఒక్క సిమ్‌ మాత్రమే పనిచేస్తుంది. టార్చ్‌లైట్‌, ఫోన్‌బుక్‌, ఎఫ్‌ఎం రేడియో, స్పీకర్‌, వైబ్రేషన్‌ మోడ్‌ ఉంటాయి.

బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రతి నిమిషానికి 15 పైసలు, బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు నిమిషానికి 40 పైసలు కాల్‌ రేట్‌గా నిర్ణయించారు. వినియోగదారుడికి ఉచితంగా 28 రోజుల వరకు రింగ్‌బ్యాక్‌ టోన్‌ సౌకర్యం కల్పించారు.

ఈ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు.. వినియోగదారులకు తక్కువ ధరలో మెరుగైన సేవలు అందించేందుకు తామంతా కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలిపారు. మొబైల్‌ ఫోన్‌ ఇక ఎంతమాత్రమూ విలాసవంతమైంది కాదని చెప్పడమే లక్ష్యంగా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+