సీఎం యడ్యూరప్ప: బీజేపీకి సవాళ్లు: రెండే మార్గాలు, సెంటిమెంట్, మఠాల మీద ఒత్తిడి!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన బీఎస్. యడ్యూరప్ప మే 19వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో విదాన సౌధలో బలపరీక్షలో ఎమ్మెల్యేల మెజారిటీ నిరూపించుకోవడానికి సిద్దం అవుతున్నారు. క్షణం తీరకలేకుండా బీఎస్. యడ్యూరప్ప బీజేపీ నాయకులతో చర్చలు జరుపుతున్నారు.

బీజేపీ మెజారిటీ

బీజేపీ మెజారిటీ

కర్ణాటక ఎమ్మెల్యేల సంఖ్య 221. విశ్వాసపరీక్షలో బీఎస్. యడ్యూరప్పకు ఎమ్మెల్యేల మద్దతు ఇవ్వాలి. యడ్యూరప్పకు 105 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇక ఆరు మంది ఎమ్మెల్యే మద్దతు కోసం బీఎస్ యడ్యూరప్ప ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి రెండు నియోజకర్గాలో విజయం సాధించడంతో ఆయన ఒక్క ఓటు మాత్రమే వేసే అవకాశం ఉంది.

ఆపని అసాధ్యం

ఆపని అసాధ్యం

పార్టీ పిరాయింపుల చట్టం కింద కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలతో బహిరంగంగా బలపరీక్షలో తమకు అనుకూలంగా ఓటు వేయించుకోవడం బీజేపీకి అసాధ్యంగా మారింది. బీజేపీ చెయ్యవలసిన పని కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను సభకు రానివ్వకుండా చెయ్యాలి, లేదా వారితో రాజీనామాలు చేయించాలి.

జేడీఎస్ సిద్దంగా లేదు

జేడీఎస్ సిద్దంగా లేదు

విశ్వసనీయ సమాచారం మేరకు జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వారి పదవులకు రాజీనామా చెయ్యడానికి సిద్దంగా లేరని తెలిసింది. ఎందుకంటే కర్ణాటకలో జేడీఎస్ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతోంది. ఇప్పుడు జేడీఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండటంతో ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చెయ్యడానికి వెనకడుగు వేస్తున్నారని సమాచారం.

మఠాల మీద ఒత్తిడి

మఠాల మీద ఒత్తిడి

బీజేపీ నుంచి లింగాయుత మఠాలకు అనేక రూపాల్లో సహాయం అందుతోంది. లింగాయుత కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు అసెంబ్లీ సమావేశంలో బలపరీక్షకు హాజరుకాకుండా చెయ్యాలని లింగాయుత మఠాల మీద తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.

సీఎం సెంటిమెంట్

సీఎం సెంటిమెంట్

లింగాయుత వర్గానికి చెందిన ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్పను పదవి నుంచి తప్పిస్తే ఆ కులస్తుల ఓటర్ల అగ్రహానికి గురికావలసి వస్తోందని కొందరు కాంగ్రెస్ శాసన సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా బీఎస్ యడ్యూరప్పకు మద్దతు ఇస్తామని, పదవులు పోయినా పర్వాలేదని ఇద్దరు ఎమ్మెల్యేలు సిద్దం అయ్యారని తెలిసింది. మొత్తం మీద ఈ టెన్షన్ శనివారం సాయంత్రం వరకు ఉంటుందని బీజేపీ నాయకులు అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The BJP in Karnataka would face a crucial floor test tomorrow at 4 pm. The total strength of the House now is 221 and the magic number would be 111 since polls in two assemblies have been deferred and H D Kumaraswamy holds two seats.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X