రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ
రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు వినిపించింది. ఆహార ధాన్యాలను పంపిణీ చేయనుంది. ఏప్రిల్ నెలతో ఇది ఆరంభమౌతుంది. మూడు నెలలకు సంబంధించిన ధాన్యాలను ఒకేసారి తీసుకోవచ్చు. అంటే ఏప్రిల్, మే, జూన్ కోటా ధాన్యాలను చౌక ధరల దుకాణాల ద్వారా ఒకేసారి రేషన్ కార్డుదారులు అందుకోవచ్చు. ప్రజా పంపిణీ వ్యవస్థపై ఆధారపడిన కోట్లాది కుటుంబాలకు ఈ నిర్ణయం ద్వారా లబ్ధి కలుగుతుంది.
ఆహార ధాన్యాల పంపిణీ సామర్థ్యం పెంపునకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా ఇది అమలు కానున్నట్లు కేంద్ర పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ తెలిపింది. లబ్ధిదారులు నెలవారీ చౌక డిపోలకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే- బియ్యం, ఇతర నిత్యావసర సరుకులతో పాటు ఆహార ధాన్యాలను కూడా ఒకేసారి అందుకునే వెసలుబాటు రేషన్ కార్డుదారులకు చిక్కినట్టవుతుంది. లాజిస్టిక్స్‌ను సులభతరం చేయడం, నిత్యావసర వస్తువులను నిరంతరాయంగా పంపిణీ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

నెలవారీ పంపిణీకి బదులుగా అర్హులైన లబ్దిదారులు మూడు నెలల గోధుమలు, బియ్యం కోటాను ఒకేసారి అందుకుంటారు. పంపిణీని సజావుగా అమలు చేయాలని, లబ్ధిదారులకు సేకరణ వివరాలను తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి ఆదేశాలు సైతం జారీ అయ్యాయి. నిర్దిష్ట గడువులోగా తమ సరసమైన ధరల దుకాణాలను సందర్శించాలని అధికారులు లబ్ధిదారులను కోరారు.
ఈ చర్య రాబోయే గోధుమ సేకరణ కార్యకలాపాలతో ముడిపడి ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్రం కొత్త నిల్వలను సేకరించడానికి, రాష్ట్రాలు కేంద్ర రిజర్వ్‌ల నుండి ముందే ధాన్యాలను తీసుకోవాలని పేర్కొంది. అలాగే పౌర సరఫరాల గోడౌన్లల్లో ప్రస్తుత స్టాక్‌ను ఖాళీ చేయడంతో పాటు కొత్త ధాన్యానికి అవసరమైనంత స్థలాన్ని కల్పించాల్సి ఉంటుందని, సప్లై చైన్ సామర్థ్యాన్ని మరింత పెంచాల్సి ఉంటుందని కేంద్రం సూచించింది.
ప్రజా పంపిణీ వ్యవస్థలో డిజిటలైజేషన్ ద్వారా గణనీయమైన మెరుగుదలలు చోటుచేసుకున్నాయి. ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ePOS) యంత్రాలు, ఆధార్ ఆధారిత ధృవీకరణ పారదర్శకతను పెంచాయి. 99 శాతం మంది లబ్ధిదారులు ఆధార్‌తో అనుసంధానితులయ్యారు. ఈ సంస్కరణలు నిత్యావసర సరుకుల పంపిణీలో గోల్ మాల్‌ను తగ్గించి, రాయితీలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చేశాయి. 2025లో, అనర్హులైన వారిని తొలగించడానికి చేసిన ధృవీకరణ డ్రైవ్‌ల తర్వాత 41 లక్షలకు పైగా రేషన్ కార్డులు రద్దయ్యాయి.
-
బ్యాచిలర్ స్టైల్ మటన్ కర్రీ.. ఇలా సింపుల్ గా చేసుకోండి..! -
DA Hike: డీఏ ప్రకటనకు ముహూర్తం ఖరారు?.. వచ్చే వారమే గుడ్ న్యూస్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..!












Click it and Unblock the Notifications