ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య: బోరుమన్న రామ్ కుమార్

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: ఇన్పోసిస్ టెక్కీ స్వాతి హత్య కేసులో నిందితుడు రామ్ కుమార్ మరోసారి బోరుమన్నాడు. పోలీసుల విచారణలో అతను ఏడ్చేశాడు. తాను స్వాతిని చంపాల్సి ఉండింది కాదని అన్నాడు. స్వాతిని చంపినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.

స్వాతిని చంపాలా, వద్దా అనే డైలమాలో తాను మొదట ఉన్నానని, అయితే స్వాతితో గొడవ తీవ్రం కావడంతో ఏమీ తెలియని స్థితిలో చంపేశానని అతను పోలీసు విచారణలో చెప్పాడు. పచ్చి ప్రేమలో ఆగ్రహాన్ని అదుపు చేసుకోలేక స్వాతిని చంపానని అతను చెప్పాడు.

భారీ బందోబస్తు మధ్య నుంగంబాక్కం పోలీసు స్టేషన్‌లో శుక్రవారం చివరి రోజు తమ కస్టడీలో పోలీసులు అతన్ని విచారించారు. తన నేరాన్ని రామ్ కుమార్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. తాను స్వాతిని ఎంతగానో ప్రేమించానని, స్వాతిని చంపడం తాను చేసిన అతి పెద్ద తప్పు అని అతను అన్నాడు.

Chennai techie murder: Ramkumar breaks down, regrets killing Swathi

రామ్ కుమార్ స్వాతిని చంపిన తర్వాత ఆయుధాన్ని విసిరేశాడని, దానిపై అతని వేలి ముద్రలు ఉన్నాయని, ఆమెను హత్య చేసిన తన గదికి వెళ్లి సాయంత్రం పొద్దు పోయేవరకు నిద్రపోయాడని, ఆ తర్వాత తన స్వస్థలానికి వెళ్లాడని పోలీసులు అంటున్నారు.

రామ్ కుమార్ వాంగ్మూలాన్ని తాము నమోదు చేశామని వారు చెప్పారు. ఊహాగానాలకు తెర దించుతూ రామ్ కుమారే స్వాతిని హత్య చేశాడని నిరూపించడానికి తమ వద్ద తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. స్వాతి ఫోన్‌ను రామ్ కుమార్ తీసుకుని వెళ్లాడని, దాన్ని అతని నుంచి తాము స్వాధీనం చేసుకున్నామని వారన్నారు.

ఆమె ఫోన్ నుంచి చిత్రాలను తన ఫోన్‌ మెమొర్ కార్డులోకి డౌన్‌లోడ్ చేసుకున్నాడని చెప్పారు. రక్తం మరకలు గల చొక్కాను స్వాధీనం చేసుకున్నామని, దాన్ని డిఎన్ఎ పరీక్షలకు పంపించామని చెప్పారు. రామ్ కుమార్ వేలి ముద్రలు మ్యాచ్ అయినట్లు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ramkumar, the suspect in the Infosys employee Swathi's murder, had reportedly broken down on Friday during interrogation and repented murdering the girl who did not reciprocate his mad love for her.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి