రాహుల్ పై లేఖ రాసిన ప్రముఖులెవరంటే ? బీజేపీ, ఆరెస్సెస్ లింక్ బయటపెట్టిన కాంగ్రెస్..!
బీహార్ ఎన్నికలకు ముందు కర్నాటక, మహారాష్ట్ర, హర్యానాలో ఓట్ల చోరీ జరుగుతోందని, చర్యలు తీసుకోవాల్సిన ఎన్నికల సంఘం అక్రమార్కులకు సహకరిస్తోందంటూ విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. బీహార్ ఎన్నికల్లో ఓటర్ల జాబితా సవరణను సైతం ఓట్ల చోరీగా ఆయన అభివర్ణిస్తూ ఓట్ అధికార్ యాత్ర చేశారు. అయితే బీహార్ ఎన్నిక్లలో కాంగ్రెస్, ఆర్జేడీతో కూడిన మహాకూటమి చిత్తుగా ఓడిపోవడంతో 272 మంది ప్రముఖులు రాహుల్ పై విమర్శలు చేస్తూ ఓ లేఖ విడుదల చేసారు. ఇందులో పలువురు మాజీ న్యాయమూర్తులు, మాజీ ఉన్నతాధికారులు, మాజీ రాయబారులు ఉన్నారు.
అయితే ప్రముఖులుగా చెప్పుకుంటూ రాహుల్ పై విమర్శలు చేస్తూ బహిరంగ లేఖ రాసిన వీరంతా ఏదో విధంగా బీజేపీ, ఆరెస్సెస్, పలు ఫౌండేషన్లతో సంబంధం ఉన్న వారు, అవినీతిపరులని చెప్తూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎక్స్ లో పోస్ట్ చేసింది. దేశవ్యాప్తంగా ఓటు చోరీని బహిర్గతం చేయడానికి ధైర్యం చేసిన రాహుల్ పై ప్రముఖులుగా చెప్పుకుంటున్న 272 మంది తెరపైకి వచ్చారని కాంగ్రెస్ ఆరోపించింది. రాహుల్ చర్య మోడీ సింహాసనం పునాదులను కదిలించిందని తెలిపింది.

కానీ ఈ "ప్రముఖ" వ్యక్తులు ఎవరు? రాహుల్ బయటపెట్టిన ఓటు చోరీకి సంబంధించిన స్పష్టమైన ఆధారాలను వారు ఎందుకు విస్మరించాలని అనుకుంటున్నారు? అలారం మోగించిన వ్యక్తిని లక్ష్యంగా చేసుకోకుండా, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రముఖ మేధావులు మొదట ముందుకు రాకూడదా? అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఈ 272 మంది "ప్రముఖులు" అని పిలవబడే వారిలో ఎక్కువగా బిజెపి సభ్యులు లేదా ఆర్‌ఎస్‌ఎస్, వివేకానంద ఫౌండేషన్ , ఇండియా ఫౌండేషన్‌తో సంబంధం కలిగి ఉన్నారని ఆరోపించింది. అలాగే వీరిలో చాలా మందిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని, కానీ మీరు బిజెపితో జతకట్టిన తర్వాత నేడు ప్రతిదీ తెల్లగా మార్చవచ్చని వ్యాఖ్యానించింది.

🚨 𝐑𝐚𝐡𝐮𝐥 𝐆𝐚𝐧𝐝𝐡𝐢'𝐬 𝐅𝐢𝐠𝐡𝐭 𝐀𝐠𝐚𝐢𝐧𝐬𝐭 𝐕𝐨𝐭𝐞 𝐂𝐡𝐨𝐫𝐢 𝐇𝐚𝐬 𝐑𝐚𝐭𝐭𝐥𝐞𝐝 𝐓𝐡𝐞 𝐁𝐉𝐏-𝐄𝐥𝐞𝐜𝐭𝐢𝐨𝐧 𝐂𝐨𝐦𝐦𝐢𝐬𝐬𝐢𝐨𝐧-𝐃𝐞𝐞𝐩 𝐒𝐭𝐚𝐭𝐞 𝐍𝐞𝐱𝐮𝐬 🚨
— Congress (@INCIndia) November 21, 2025
Some 272 "eminent" voices have suddenly come out of the blue to target LoP Rahul Gandhi ji…
వీరంతా హక్కులు లేదా ప్రజాస్వామ్యం లేదా రాజ్యాంగం గురించి ఆందోళన చెందుతున్న మేధావి వర్గం కాదని, వారు తమను రక్షించే వ్యవస్థను రక్షించాలనుకుంటున్నారని కాంగ్రెస్ విమర్శించింది. వీరంతా బిజెపి నాయకులు, విధేయులైన సంస్థలు , ఎంపిక చేసిన బిజెపి అనుకూల ఉన్నత వర్గాలతో అనుబంధం ఉన్నవారే అని తెలిపింది. అలాగే ఈ జాబితాలో ఉన్న వారు బీజేపీ, ఆరెస్సెస్ తో పాటు ఇతర సంస్థలతో ఎలా బంధం కలిగి ఉన్నారో ట్వీట్ లో కాంగ్రెస్ వివరించింది.
-
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
3,000 పెన్షన్, ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు.. కేరళలో బీజేపీ మేనిఫెస్టో ఇదే.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications