వేడెక్కిన కన్నడ పాలిటిక్స్.. కుమారస్వామికి సీఎం పదవి.. కాంగ్రెస్ షాకింగ్ నిర్ణయం?
కర్ణాటకలో ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీపై స్పష్టత లేనందున అసెంబ్లీలో హంగ్ ఏర్పడే పరిస్థితి కనిపిస్తున్నది. ఉదయం బీజేపీ జోరు బాగానే కనిపించినా మధ్యాహ్నం సమయానికి కాంగ్రెస్ కొంత అడ్డుకట్ట వేయగలిగింది. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి బీజేపీ 100కుపైగా, కాంగ్రెస్ 78 స్ఠానాల్లో, జడీఎస్ 37 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నాయి.
Recommended Video


కీలక నిర్ణయాల దిశగా
హంగ్ ఖాయమనే సంకేతాలు అందుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ నేతల మధ్య చర్చలు తీవ్రస్థాయికి చేరుకొన్నాయి. ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ కీలకమైన నిర్ణయాలు తీసుకొనే దిశగా ఇరు పార్టీలు అడుగులేస్తున్నాయి.

సీఎం పదవి ఇచ్చేందుకు
మీడియా కథనాల ప్రకారం.. జేడీఎస్ నేత కుమారస్వామికి సీఎం పదవిని కట్టబెట్టేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధమవుతున్నది. ప్రభుత్వంలో చేరడానికి విముఖతను ప్రదర్శిస్తున్నది.

బిజీ బిజీగా కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ జాతీయ నేతలు ఇప్పటికే బెంగళూరులో మకాం వేశారు. ఓ హోటల్‌లో సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లట్ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ చర్చల్లో మల్లికార్జున్ ఖర్గే కీలకంగా మారారు.

జేడీఎస్‌కు కాంగ్రెస్ మద్దతు
పూర్తి మెజారిటీ రానందున జేడీఎస్‌కు మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం అందుతున్నది. జేడీఎస్‌కు బయట నుంచి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని అంటున్నట్టు వార్తలు అందుతున్నాయి.

వేడెక్కిన కన్నడ రాజకీయం
జేడీఎస్ నేత కుమారస్వామి ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్నారు. మంగళవారం రాత్రికి ఆయన బెంగళూరుకు చేరుకొంటారు. ఈ రాత్రికి కన్నడ రాజకీయాలు కీలకంగా మారనున్నాయి.
-
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
3,000 పెన్షన్, ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు.. కేరళలో బీజేపీ మేనిఫెస్టో ఇదే.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications