
కరోనాపై కేంద్రం సంచలన ప్రకటన-గాలి ద్వారానే వైరస్ వ్యాప్తి-కొవిడ్ ప్రోటోకాల్స్ సవరణ,కొత్త గైడ్ లైన్స్
దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయం అతి ప్రమాదకరంగా కొనసాగుతున్నది. రోజువారీ కొత్త కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాలు భారీగా నమోదవుతున్నాయి. ఇంకొద్ది రోజుల్లోనే మూడో వేవ్ తప్పదన్న హెచ్చరికలు మరింత ఆందోళన కలుగజేస్తున్నాయి. వైరస్ కట్టడికి వ్యాక్సిన్లే బ్రహహ్మాస్త్రాలని భావిస్తున్నా, కొరత వల్ల వ్యాక్సినేషన్ ముందుకుసాగడంలేదు. ఈక్రమంలోనే వైరస్ వ్యాప్తికి సంబంధించి కేంద్రం సంచలన ప్రకటన చేసింది. కొవిడ్ ప్రోటోకాల్స్ ను సవరించి, కొత్త గైడ్ లైన్స్ జారీ చేసింది..

గాలి ద్వారానే ఎక్కువ వ్యాప్తి
మన దేశంలో కరోనా వైరస్ అత్యధికంగా గాలి ద్వారానే వ్యాప్తి చెందుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొవిడ్ వ్యాధికి గురైన వ్యక్తులు దగ్గడం, తుమ్మడం, మాట్లాడటం లాంటివి చేసినప్పుడు బయటికి వచ్చే తుంపర్ల ద్వారా కూడా వైరస్ అధికంగా వ్యాప్తి చెందుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ వివరాలతో తాజాగా క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్‌ను కేంద్రం బుధవారం జారీ చేసింది. కరోనా వ్యాప్తిపై గతేడాది జూన్‌లో జారీ చేసిన ప్రోటోకాల్‌కు ఇది పూర్తి భిన్నంగా ఉంది. శ్వాస సంబంధిత తుంపర్ల ద్వారా మాత్రమే వైరస్ సోకుతుందని గత ప్రొటోకాల్స్ లో పేర్కొన్న కేంద్రం.. ఇప్పుడు మాత్రం కరోనా ఎక్కువగా గాలివల్లే వ్యాపిస్తున్నదని చెప్పడం గమనార్హం.
సీజేఐ
రమణ
ప్రతిపాదనతో
ఎంపిక
-సీబీఐ
కొత్త
డైరెక్టర్గా
సుబోధ్
కుమార్
జైస్వాల్
బాధ్యతల
స్వీకారం

10 మీటర్ల పరిధిలో వైరస్.
దేశంలో
కరోనా
వైరస్
గాలి
ద్వారా
వ్యాప్తి
చెందుతోందని
పలు
ఏజెన్సీలు
గతంనుంచీ
హెచ్చరిస్తున్నా,
వాటిని
తోసిపుచ్చుతూ
వచ్చిన
కేంద్రం
తొలిసారి
కరోనా
ఎయిర్
బోన్
అనే
విషయాన్ని
అంగీకరించింది.
ప్రభుత్వ
ప్రిన్సిపల్
సైంటిఫిక్
అడ్వయిజర్
కార్యాలయం
విడుదల
చేసిన
మార్గదర్శకాల్లో
కూడా
కోవిడ్-19
మహమ్మారి
వ్యాప్తి
గాలి
తుంపర్ల
ద్వారా
జరుగుతున్నట్లు
తెలిపింది.
ఈ
వైరస్
సోకిన
గాలి
తుంపర్లు
గాలిలో
దాదాపు
10
మీటర్ల
వరకు
ప్రయాణించే
అవకాశం
ఉందని
తెలిపింది.
దీనిపై..

అలాగైతే కరోనా కాటు తప్పదు..
ప్రపంచ
ఆరోగ్య
సంస్థ
(డబ్ల్యూటీఓ)ను
ఉటంకిస్తూ
కేంద్ర
ఆరోగ్య
మంత్రిత్వ
శాఖ
తాజాగా
విడుదల
చేసిన
క్లినికల్
మేనేజ్‌మెంట్
ప్రోటోకాల్‌లో
కీలక
విషయాలను
ప్రస్తావించింది.
కోవిడ్-19
వైరస్
ప్రధానంగా
సమీపంలో
ఉండే
వ్యక్తుల
ద్వారా
వ్యాపిస్తున్నట్లు,
ముఖ్యంగా
1
మీటరు
పరిధిలో
ఉన్నవారి
నుంచి
వ్యాపిస్తున్నట్లు
ప్రస్తుత
సాక్ష్యాధారాలున్నాయని,
వైరస్
ఉన్న
గాలి
తుంపర్లను
లేదా
నీటి
తుంపర్లను
పీల్చినవారికి
లేదా
అవి
కళ్ళలో,
ముక్కులో,
లేదా,
నోటిలో
పడినవారికి
ఈ
వ్యాధి
సోకుతుంది
పేర్కొంది.
గాలి,
వెలుతురు
లేని
ప్రదేశాల్లో
ఉండేవారికి
కూడా
ఈ
వ్యాధి
సోకుతుంది.
గాలి,
వెలుతురు
ధారాళంగా
ప్రసరించని
గదులు
వంటివాటిలో
ఎక్కువ
మంది,
చాలా
సేపు
ఉంటే,
వారికి
ఈ
ఇన్ఫెక్షన్
వ్యాపిస్తుంది.
గాలి
తుంపర్లు
ఒకే
చోట
స్థిరంగా
ఉండిపోవడం,
ఒక
మీటరు
కన్నా
ఎక్కువ
దూరం
ప్రయాణించడం
వల్ల
ఈ
ఇన్ఫెక్షన్
వ్యాపిస్తుందని
తెలిపింది.