ఆయోమయంలో దీపా: నామినేషన్ పత్రాల్లో: ఎందుకు అలా చేశారు ?

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ నామినేషన్ ను ఎన్నికల అధికారులు తిరస్కరిస్తారా ? అనే విషయంపై ఇప్పుడు పెద్ద చర్చ మొదలైయ్యింది. దీపా జయకుమార్ ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటే ఎవరికి లాభం అనే విషయం అంతుపట్టడం లేదు.

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి దీపా జయకుమార్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ పత్రాల్లో ఆమె పూర్తి వివరాలు వెల్లడించలేదని వెలుగు చూసింది. దీపా జయకుమార్ ఆమె భర్త పేరు కూడా అందులో పేర్కొనలేదని తెలిసింది.

Deepa's nomination form may get rejected as she wasn't reveal important details.

ఇప్పటికే విజయ్ కాంత్ పార్టీకి చెందిన అభ్యర్థి నామినేషన్ ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో విజయ్ కాంత్ పార్టీ గుర్తు తెరమరుగైయ్యింది. పన్నీర్ సెల్వం వర్గంలోని మధుసూదనన్ నామినేషన్ ఓకే కావడంతో ఆయన బరిలో ఉన్నారు.

ఇప్పుడు శశికళ వర్గంలోని టీటీవీ. దినకరన్, జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. అమ్మ వారసురాలు నేనే అంటూ ఇన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చిన దీపా నామినేషన్ పత్రాలు పరిశీలించిన తరువాత ఎన్నికల అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Deepa Jayakumar's nomination form may get rejected as she wasn't reveal important details.
Please Wait while comments are loading...