ఢిల్లీ కారు బాంబు పేలుడు సంభవించిన 113 గంటల తర్వాత..
దేశ రాజధానిలోని చారిత్రాత్మక రెడ్ ఫోర్ట్ సమీపంలో కారు బాంబు పేలుడు ఘటన ప్రకంపనలు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. ఢిల్లీలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి. యావత్ దేశాన్ని వణికించిన ఈ పేలుడు ఘటనపై ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది. ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. అల్ ఫలా యూనివర్శిటీ, ఫరీదాబాద్ కేంద్రబిందువుగా ఈ పేలుడుకు కుట్ర పన్నినట్లు గుర్తించిన పోలీసులు, ఎన్ఐఏ అధికారులు సూత్రధారులను అరెస్ట్ చేశారు.
రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ కారులో ఈ నెల 10వ తేదీన సాయంత్రం జరిగిన పేలుడు ఘటన.. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ పేలుడులో 12 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పరామర్శించారు. ఢిల్లీ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తోన్నారు. గుజరాత్ లో ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన అతి కొద్దిరోజుల్లోనే ఈ పేలుడు సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

దీని తర్వాత ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జనసమ్మర్థంతో కూడుకుని ఉన్న ప్రదేశాలు, సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలపై నిఘా పెంచారు. రాత్రంతా పోలీసులు పహారా చేపట్టారు. వాహనాల తనిఖీ ముమ్మరంగా కొనసాగింది. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం వదిలిపెట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఉగ్రవాద కార్యకలాపాలు, కుట్ర, పేలుడు పదార్థాల నిర్వహణ, ప్రజల భద్రతకు ముప్పు కలిగించే నేరాలకు సంబంధించిన యూఏపీఏలోని సెక్షన్లు 16, 18, ఎక్స్‌ప్లోజివ్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్‌లోని సెక్షన్లు 3, 4, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 103(1), 109(1), 61(2) కింద ఈ కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళా డాక్టర్ షాహీన్ సయీద్ ను ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. ఈ పేలుడుకు నిధులు సమకూర్చడంలో ఆమె పాత్ర కీలకంగా మారింది.

ఈ దిగ్భ్రాంతికర ఘటన నుంచి దేశ రాజధాని ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. రెడ్ ఫోర్ట్ వద్ద సాధారణ పరిస్థితులు నెలకొంటోన్నాయి. ఈ క్రమంలో పేలుడు సంభవించిన ప్రదేశాన్ని ఢిల్లీ పోలీసులు తెరిచారు. ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. దాదాపు 113 గంటల తర్వాత పేలుడు సంభవించిన ప్రాంతం తిరిగి తెరుచుకుంది. దీనితో ఈ ప్రాంతంలో రోజువారీ కార్యకలాపాలు మళ్ళీ ప్రారంభమయ్యాయి.
పోలీసులు పేలుడు జరిగిన స్థలం వద్ద ఏర్పాటు చేసిన టెంట్‌ను తొలగించారు. దీంతో ట్రాఫిక్, ప్రజల రాకపోకలకు అనుమతి లభించింది. చాందినీ చౌక్, భగీరథ్ ప్యాలెస్‌తో సహా అత్యంత రద్దీగా ఉండే మార్కెట్లను అనుసంధానించే రోడ్ ఇది. ఇప్పుడు దీన్ని పూర్తిగా తిరిగి తెరిచారు ఢిల్లీ పోలీసులు. పేలుడు సంభవించిన ప్రదేశం నుంచి OneIndia Exclusive Report అందిస్తోంది.
ఢిల్లీ కారు బాంబు పేలిన ఘటన తర్వాత సామాన్యులకు రోడ్ ఓపెన్ చేసిన పోలీసులు#RedFort #DelhiNews #DelhiBlast #BombBlast #NewsUpdate #OIUpdates #Oneindiatelugu pic.twitter.com/eISaZ2XA6W
— oneindiatelugu (@oneindiatelugu) November 15, 2025
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications