షాక్: డేరా సౌధాలో పేలుడు ఫ్యాక్టరీ, భారీగా ఆయుధాలు సీజ్

Subscribe to Oneindia Telugu

సిర్సా: డేరా సచ్చా సౌదా ప్రధాన కేంద్రమైన సిర్సాలో రెండో రోజు కూడా అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంగణంలో శుక్రవారం తనిఖీలు ప్రారంభించిన అధికారులు ఓ కారు, పాతనోట్లు, ప్లాస్టిక్‌ కరెన్సీను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

పేలుడు ఫ్యాక్టరీ సీజ్

పేలుడు ఫ్యాక్టరీ సీజ్

అధికారులు, పోలీసు బలగాలు శనివారం కూడా సోదాలు కొనసాగించారు. డేరా సౌధా ప్రాంగణంలో అక్రమ పేలుడు పదార్థాల ఫ్యాక్టరీ ఉన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. దీంతో ఆ ఫ్యాక్టరీని సీజ్‌ చేశారు. అంతేగాక, ఓ బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.

పేలుడు పదార్థాల సీజ్

పేలుడు పదార్థాల సీజ్

భారీగా పేలుడు పదార్థాలు, బాణసంచాను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో డేరా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు 20ఏళ్ల జైలు శిక్షను విధించిన విషయం తెలిసిందే.

పాతనోట్లు, ప్లాస్టిక్ కరెన్సీ

పాతనోట్లు, ప్లాస్టిక్ కరెన్సీ

కోర్టు తీర్పు అనంతరం సిర్సాలోని డేరా ఆశ్రమంలో తనిఖీలు చేపట్టాలని న్యాయస్థానం అధికారులను ఆదేశించింది. దీంతో శుక్రవారం సోదాలు చేపట్టిన అధికారులు.. హార్డ్‌ డిస్కులు, లేబుళ్లు లేని మందులు, వాకీటాకీ సెట్‌, భారీగా పాతనోట్లు, ప్లాస్టిక్‌ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

ఇంటర్నెట్ సేవలు బంద్

ఇంటర్నెట్ సేవలు బంద్

అయితే డేరా సౌధా సోదాల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఆ ప్రాంతలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. భారీగా బలగాలను మోహరించారు. డేరా సౌధాలో అనేక విలాసవంతమైన భవనాలుండటం గమనార్హం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Read in English: Explosives found in Dera
English summary
The Haryana Government on Saturday said that an illegal explosives factory was found inside Dera Sacha Sauda headquarters in Sirsa during the sanitisation operations which began on Friday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి