వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీమాంధ్ర సమ్మెపై డిగ్గీ హాట్ కామెంట్: బాబు, కిరణ్‌లపై

By Srinivas
|
Google Oneindia TeluguNews

Digvijay Singh
న్యూఢిల్లీ: సీమాంధ్ర సమ్మె పైన కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ బుధవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్ర ప్రాంతంలో అన్ని ప్రయివేటు సంస్థలు పని చేస్తుంటే ప్రభుత్వ కార్యాలయాలు ఎందుకు బందు చేస్తున్నారని ప్రశ్నించారు. సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె మాని విధులకు హాజరు కావాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ముసాయిదాను తయారు చేస్తోందని చెప్పారు. సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు రాజీనామాలపై తొందరపడ వద్దని కోరారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుమ్మక్కైందన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

తాము వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కైతే.. తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కయిందా చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెసుతో కుమ్మక్కు కావడం వల్లనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చిందని టిడిపి విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఓ ప్రాంతానికి ముఖ్యమంత్రి కాదని, ఆయన అన్ని ప్రాంతాలని కలుపుకు పోవాలని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ముఖ్యమంత్రి తెలంగాణను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామా చేయకుండా వారి వారి సమస్యలు ఏమిటో తమకు చెప్పాలని దిగ్విజయ్ సింగ్ హితవు పలికారు.

విభజనకు సంబంధించిన సమస్యలన్నింటిని తాము కచ్చితంగా పరిశీలిస్తామని చెప్పారు. తెలంగాణపై హోంశాఖ ముసాయిదా తయారు చేస్తోందన్నారు. కేబినెట్ నోట్ తయారైన తర్వాత అసెంబ్లీకి పంపిస్తామని చెప్పారు.

English summary
AP Congress Party incharge Digvijay Singh on Wednesday questioned Seemandhra stir. He asked why government offices are closed as private institutes are running.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X