అమెరికా సుప్రీం తీర్పుపై స్పందించిన భారత్..! ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
భారత్ సహా పలు దేశాలపై భారీ ఎత్తున సుంకాలు (tariffs)విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) తీసుకున్న నిర్ణయాలను అక్కడి సుప్రీంకోర్టు (supreme court) తాజాగా నిలిపేసింది. విదేశాలపై సుంకాలు విధించే హక్కు అధ్యక్షుడికి లేదని, కేవలం కాంగ్రెస్ కు మాత్రమే ఉందని తేల్చేసింది. దీంతో భారత్ పై తగ్గింపుల తర్వాత 18 శాతానికి చేరిన సుంకాలు కాస్తా 10 శాతానికి తగ్గాయి. దీనిపై ట్రంప్ స్పందించి తదుపరి చర్యల్ని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారత్ ఇవాళ తాజా పరిణామాలపై స్పందించింది.
అమెరికా సుంకాల పరిణామాలు, వాటి పర్యవసానాలను భారత ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుని, ఈ విషయంలో ట్రంప్ నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని ప్రస్తావించింది. సుంకాలపై నిన్న అమెరికా సుప్రీంకోర్టు తీర్పును తాము గమనించామని, ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా విలేకరుల సమావేశంలో ప్రసంగించారని కేంద్రం తెలిపింది.

సుప్రీంకోర్టు తన గత దిగుమతి సుంకాలను ఎత్తివేసిన కొన్ని గంటల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, అన్ని దేశాల నుండి దిగుమతులపై 10% సుంకం విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశానని వెల్లడించారు. ఇది తన వాణిజ్య ఎజెండాను పెంచుతుందన్నారు. కొత్త సుంకాలు ఫిబ్రవరి 24న ఉదయం 10:31 గంటలకు భారత కాలమానం ప్రకారం అమల్లోకి రానున్నాయి. డొనాల్డ్ ట్రంప్ సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, ఆ దేశం తాత్కాలికంగా 10 శాతం దిగుమతి సర్ఛార్జ్ విధిస్తూ కొత్త ఉత్తర్వు జారీ చేయడంతో, భారతీయ వస్తువులు ఫిబ్రవరి 24 నుండి 10 శాతం పరస్పర సుంకాన్ని మాత్రమే ఎదుర్కొంటాయని వైట్ హౌస్ స్పష్టం చేసింది.
-
యుద్ధం వేళ అమెరికా సంచలన నిర్ణయం.. ఆర్మీ చీఫ్ తొలగింపు -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!!












Click it and Unblock the Notifications