బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలికి 'కూతురు' షాక్: సూసైడ్ నోట్లో దిమ్మతిరిగే ఆస్తుల చిట్టా, జాబితాలో మంత్రులు?

మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. నోట్ల రద్దు తర్వాత తన కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా చేశాడు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. నోట్ల రద్దు తర్వాత తన కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా చేశాడు. అయితే, రూ.100 కోట్ల నల్లధనాన్ని తెల్లగా మార్చినట్లుగా ఆయన పైన తాజాగా ఆరోపణలు వస్తున్నాయి.

గాలికి కూతురు పెళ్లి షాక్: డ్రైవర్ సూసైడ్ నోట్‌తో చిక్కులుగాలికి కూతురు పెళ్లి షాక్: డ్రైవర్ సూసైడ్ నోట్‌తో చిక్కులు

కేఏఎస్ అధికారి భీమా నాయక్ వద్ద డ్రైవర్‌గా పని చేసే రమేష్ గౌడ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇది కర్నాటకలో సంచలనం రేపుతోంది. గాలి అధికారి భీమా నాయక్ సాయంతో ఇరవై శాతం కమీషన్‌తో రూ.100 కోట్ల నల్లధనాన్ని తెల్లగా మార్చుకున్నాడు. ఇందుకు కమీషన్‌తో పాటు 2018 ఎన్నికల్లో సీటు ఇప్పించడంలో సాయం చేయాలని కూడా అడిగినట్లు తెలుస్తోంది.

gali janardhan reddy

అయితే, మార్పిడిలో రూ.18 లక్షలు తక్కువగా వచ్చాయని గాలి అనుచరులు అధికారి భీమా నాయక్ డ్రైవర్ రమేష్ గౌడను బెదిరించారు. దీంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతను 23 పేజీల లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. అందులో గాలి - అధికారి భీమా నాయక్ మధ్య రూ.100 కోట్ల మార్పిడిని పేర్కొన్నారు.

మరెన్నో షాకింగ్ విషయాలు రాశాడు. గాలి సహా కర్నాటక మంత్రులు కూడా నల్లధనం మార్చుకున్నారని రమేష్ గౌడ సూసైడ్ నోట్లో ఆరోపించాడు. ఇదే నోట్లో అధికారి భీమా నాయక్ అక్రమాస్తుల చిట్టా ఇది అంటూ కూడా రమేష్ గౌడ కొన్నింటిని రాశారు. భీమా నాయక్ వద్ద ఈ ఆస్తులు ఉన్నాయని చెబుతూ.. సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.

అందులో పేర్కొన్న దాని ప్రకారం..

- భీమా నాయక్ రూ.100 కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నాడు.
- తహశీల్దారుగా ఉన్నప్పుడు బెల్గాంలోని సదాశివనగర్‌లో ఓ బంగ్లా కొన్నాడు.
- బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లోన్ తీసుకొని బళ్లారి జిల్లాలోని హోస్పేటలో ఇల్లు కొన్నాడు. ఇది ఇరవై గుంటలు ఉంది.
- బళ్లారి జిల్లాలోని హగరిబొమ్మనహళ్లి వద్ద 30 ఎకరాల వ్యవసాయ భూమి కొన్నాడు.
- బళ్లారి జిల్లాలోని మరియమ్మనహళ్లి వద్ద 10 ఎకరాల భూమి కొన్నాడు.
- ఓ వ్యక్తి నుండి రూ.5 కోట్ల భూమి కొన్నాడు.
- యెలహంకలోని అత్తూరులో సొంతిల్లు ఉంది.
- సోదరుడి పేరు మీద పెట్రోల్ పంపు
- సోదరుడి పేరు పైన రెండు కార్లు
- మరో సోదరుడి పేరు మీద మరో కారు.
- తన పైన డిపార్టుమెంటల్ విచారణను నిలిపివేసేందుకు రూ.25 లక్షల లంచం ఇచ్చాడు.
- రూ.1 జ్యువెల్లరి కొన్నాడు. అలాగే రూ.50 లక్షల డైమండ్ రింగ్ కొన్నాడు.
- రూ.50 లక్షల బట్టలు కొన్నాడు.
- ఎంపీ శ్రీరాములు ఇంటికి పలుమార్లు వెళ్లాడు.
- 20 శాతం కమీషన్ మీద రూ.100 కోట్ల (పాత రూ.500, రూ.1000 నోట్లు) నల్లధనాన్ని తెల్లధనంగా మార్చాడు.

English summary
Driver's suicide note accuses Janardhan Reddy of laundering Rs 100 crore black money
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X