వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్ లో కాంగ్రెస్ హవా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

చండీఘడ్: పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా కన్పిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకొనే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారంగా కాంగ్రెస్ పార్టీకి 62 నుండి 71 స్థానాలను కైవసం చేసుకొనే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తెలుపుతున్నాయి.

పంజాబ్ రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఇలా ఉన్నాయి.అయితే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయని ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయి,.అయితే సి ఓటర్ ఎగ్జిట్ ఫలితాల్లో మాత్రమే ఆప్ కు కాంగ్రెస్ కంటే ఎక్కువ ఫలితాలు వచ్చాయి. ఇతర సర్వేల్లో మాత్రం కాంగ్రెస్ హవా కన్పించింది.

NDTV: కాంగ్రెస్ :62-71 బిజెపి ఆకాళీదళ్ కూటమి:04 -07, ఆప్ 42-51

C VOTER: కాంగ్రెస్ :45 బిజెపి ఆకాళీదళ్ కూటమి:09 ఆప్:63

NEWS X :కాంగ్రెస్ :55 బిజెపి ఆకాళీదళ్ కూటమి:07 ఆప్:55

అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకారంగా 42 నుండి 51 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది.అయితే ఇప్పటివరకు అధికారంలో ఉన్న బిజెపి శిరోమణి అకాలీదళ్ కూటమి కూడ ఘోర ఓటమిని మూటగట్టుకొనే పరిస్థితిని కన్పిస్తోంది. ఈ కూటమి సుమారు 7 స్థానాలకు పరిమితం కావాల్సి వస్తోంది.

గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుండి నాలుగు పార్లమెంట్ స్థానాలను కరైవసం చేసుకొన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఎన్నికల్లో కేంద్రీకరించి పనిచేసింది. డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆ పార్టీకి చెందిన ముఖ్యమైన నాయకులు ఎక్కువగా ఈ రాష్ట్రంలోనే కేంద్రీకరించి పనిచేశారు.

దీంతో

దీంతో

ఆమ్ ఆద్మీ పార్టీకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీతో నువ్వా నేనా అన్నట్టుగా ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం తెలుస్తోంది. అయితే సుదీర్ఘ కాలం పాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన బిజెపి , శిరోమణి అకాలీదళ్ కూటమి పాలనకు ప్రజలు విసిగి పోయారని ఎగ్జిట్ పోల్ పలితాలు తేటతెల్లం చేస్తున్నాయి.బిజెపి శిరోమణి అకాలీదళ్ కూటమి కేవలం 10 స్థానాలలోపుగానే ఉంటాయని ఎగ్జిట్ పోల్ నివేదికలు చెబుతున్నాయి.అయితే పంజాబ్ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఓటర్లు మార్పును కోరుకొంటున్నారని ఎగ్జిట్ ఫోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

ఎగ్జిట్ పోల్స్ లో

ఎగ్జిట్ పోల్స్ లో

పంజాబ్ రాష్ట్రంలో సీ ఓటర్ సర్వే ప్రకారంగా 59 నుండి 67 స్థానాల్లో ఆప్ విజయం సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్ రాష్ట్రంలో 59 స్థానాలు కైవసం చేసుకొంటే ముఖ్యమంత్రి పీఠం దక్కనుంది.ఆప్ పార్టీ మాల్వా ప్రాంతంలో ప్రత్యర్థులను మట్టికరిపించింది.

మాల్వా రీజియన్ లో ఆప్ హవా

మాల్వా రీజియన్ లో ఆప్ హవా

ఈ ప్రాంతంలో ఆప్ సుమారు 42 సీట్లను కైవసం చేసుకొనే అవకాశం ఉంది.అయితే ఈ ప్రాంతంలో బిజెపి అకాలీదళ్ కూటమి కేవలం 5 సీట్లకే పరిమితం కానుందని సీ ఓటర్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.ఈ ప్రాంతంలో 2012 లో బిజెపి అకాలీదళ్ కూటమి 33 సీట్లను కైవసం చేసుకొంది.అయితే మాల్వా ప్రాంతంలో 2012 లో కాంగ్రెస్ పార్టీ 28 సీట్లను కైవసం చేసుకొంది.అయితే ఈ దఫా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో తన పట్టును కోల్పోయింది. ఈ దఫా కేవలం 16 సీట్లను మాత్రమే కైవసం చేసుకోనుందని సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ సర్వే తెలుపుతున్నాయి.

డోబ్ రీజియన్ లో కాంగ్రెస్ హవా

డోబ్ రీజియన్ లో కాంగ్రెస్ హవా

పంజాబ్ రాష్ట్రంలోని డోబ్ రీజియన్ లో కాంగ్రెస్ పార్టీ హవా కన్పించే అవకాశం ఉందని సీ ఓటర్ ఎగ్జిట్ పలితాలు వెల్లడిస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీ 2012 కంటే ఈ దఫా 19 స్థానాలకు అధికంగా కైవసం చేసుకొనే అవకాశాలు ఉన్నట్టు ఎగ్జిట్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 2012 లో కాంగ్రెస్ పార్టీ ఈ రీజియన్ లో కేవలం11 స్థానాలను మాత్రమే కైవసం చేసుకొంది. అయితే ఈ దఫా ఈ స్థానాలకు అదనంగా మరో 19 స్థానాలు దక్కే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.ఇక బిజెపి ఆకాలీదళ్ పార్టీలు మాత్రం ఈ రీజియన్ కేవలం రెండు స్థానాలకే పరిమితమయ్యే అవకాశం ఉందని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.గత ఎన్నికల్లో ఈ ప్రాంతం నుండి బిజెపి ఆకాళీ దళ్ కూటమి 16 స్థానాలను కైవసం చేసుకొంది,.అయితే ఈ దపా కేవలం రెండు స్థానాలకే ఈ కూటమి పరిమితమయ్యే అవకాశం ఉంది.అయితే ఈ దఫా ఆప్ 6 సీట్లను గెలుచుకొనే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఆప్ పోటీ చేయలేదు.

మాన్జా రీజియన్ లో బిజెపి ఆకాళీ దళ్ కూటమికి చావుదెబ్బ

మాన్జా రీజియన్ లో బిజెపి ఆకాళీ దళ్ కూటమికి చావుదెబ్బ

మాన్జా రీజియన్ లో బిజెపి ఆకాళీదళ్ కూటమికి చావు దెబ్బ తగిలే అవకాశం ఉందని ఎగ్జిట్ ఫోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.ఈ రీజియన్ లో కూడ కేవలం 2 స్థానాలకే బిజెపి ఆకాళీదళ్ కూటమి పరిమితమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.2012 ఎన్నికల్లో ఈ రీజియన్ లో బిజెపి ఆకాళీదళ్ కూటమి 19 స్థానాలను కైవసం చేసుకొంది. ఈ దఫా కేవలం రెండు స్థానాలకు మాత్రమే ఈ కూటమి పరిమితం కానుంది.కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో మరో మూడు సీట్లు అదనంగా ఈ రీజియన్ నుండి విజయం సాధించే అవకాశాలున్నట్టుగా ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.ఈ దఫా ఈ రీజియన్ నుండి సుమారు 10 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.ఆప్ కూడ ఈ రీజియన్ లో 15 స్థానాలను కైవసం చేసుకొనే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి.

ఓట్ల శాతాన్ని పంచుకొన్నారిలా

ఓట్ల శాతాన్ని పంచుకొన్నారిలా

బిజెపి అకాళీదళ్ కూటమి ఈ ఎన్నికల్లో భారీగా తన ఓటింగ్ శాతాన్ని కోల్పోయింది. 2012 లో ఈ కూటమికి42.9 శాతం ఓట్లు వచ్చాయి.అయితే ఈ ఎన్నికల్లో ఈ కూటమి20.5 శాతం ఓట్లను కోల్పోయింది. దీంతో ఈ కూటమి ఘోర పరాజయాన్ని కోల్పోవాల్సిన పరిస్థితులు అనివార్యంగా కన్పిస్తున్నట్టు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.2012 ఎన్నికలతో పోలిస్గే కాంగ్రెస్ పార్టీ కూడ తన ఓట్ల శాతాన్ని కోల్పోయింది.2012 లో కాంగ్రెస్ పార్టీకి 40.1 శాతం ఓట్లు వస్తే, ఈ దఫా 36.3 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.ఆమ్ ఆద్మీ పార్టీకి 34 శాతం ఓట్లు వచ్చాయి.గత ఎన్నికల్లో ఈ ఫార్టీ పోటీచేయలేదు.

English summary
exit poll result in punjab
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X