ఇండియాలో 'ఫేస్‌బుక్' కొత్త కమ్యూనికేషన్ సిస్టమ్: విపత్తు సమయాల్లో ఆదుకునేందుకు..

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తనవంతుగా సహాయం అందించేందుకు ఫేస్‌బుక్‌ ముందుకొచ్చింది. సామాజిక స్పృహతో ఫేస్‌బుక్‌ ప్రవేశపెట్టబోతున్న కమ్యూనికేషన్ సిస్టమ్‌కు సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

విపత్తుల సమయంలో సహాయం అందించడానికి గాను.. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ), సీడ్స్‌ అనే స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఫేస్‌బుక్ తమ సహాయ కార్యకలాపాలను కొనసాగించనుంది.

సత్వర సహాయం కోసమే:

సత్వర సహాయం కోసమే:

విపత్తుల సమయంలో పరిస్థితిని సమీక్షించేందుకు అనుగుణంగా డిజాస్టర్ మ్యాప్స్ డేటాను ఫేస్ బుక్ అందించనుంది. జాతీయ విపత్తు సంస్థ, సీడ్స్ సంస్థలకు ఈ డేటాను అందించనుంది. సత్వర సహాయం అందించడమే లక్ష్యంగా భారత్ లో దీన్ని లాంచ్ చేస్తున్నట్టు ఫేస్‌బుక్‌ ప్రోగ్రామ్స్‌ అధినేత రితేశ్ మెహతా తెలిపారు.

విపత్తు సమయాల్లో కమ్యూనికేషన్:

విపత్తు సమయాల్లో కమ్యూనికేషన్:

విపత్తు సహాయక చర్యల సమయంలో కమ్యూనికేషన్ సమస్యలు దేశంలో తీవ్రంగా ఉన్నాయి. బాధితులతో కమ్యూనికేషన్ కొరవడటంతో సహాయక చర్యలు ఆలస్యమై ప్రాణ నష్టం చోటు చేసుకుంటోంది.

దీన్ని నివారించడానికి డిజాస్టర్‌ మ్యాప్స్‌ డేటా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. తద్వారా ఫేస్‌బుక్‌ వినియోగదారుల హైకాన్సంట్రేషన్‌ అకస్మాత్తుగా ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిపోయినా డేటా ఇన్‌సైట్‌ ద్వారా బాధితులకు సహాయం అందే పరిస్థితులు ఉంటాయి.

తొలుత అమెరికాలో

తొలుత అమెరికాలో

గత జూన్‌లోనే ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌ డిజాస్టర్‌ మ్యాప్స్‌ను ప్రవేశపెట్టింది. అమెరికా, పెరూలో తొలుత దీన్ని పరీక్షించింది. చెన్నై వరదల సమయంలో చాలామంది దీన్ని ఉపయోగించి సహాయం చేసేందుకు వచ్చారు.

ఫేస్‌బుక్‌ పబ్లిక్‌ పాలసీ రీసెర్చ్‌ మేనేజర్‌ చాయా నాయక్‌ ఇదే విషయాన్ని వెల్లడించారు. కాగా, విపత్తు సమయాల్లో కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకునేందుక వీలుగా ఫేస్‌బుక్ ఇదివరకే ప్రయోగాత్మకంగా సేవలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఫేస్‌బుక్ పై హర్షం

ఫేస్‌బుక్ పై హర్షం

సామాజిక స్పృహతో ఫేస్‌బుక్ ప్రవేశపెడుతున్న డిజాస్టర్ మ్యాప్స్ డేటా పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. విపత్తు సందర్బాల్లో ప్రాణ-ఆస్తి నష్ట నియంత్రణకు ఈ కమ్యూనికేషన్ పనిచేస్తుందని భావిస్తున్నారు. మున్ముందు ఫేస్‌బుక్ సామాజిక బాధ్యతలోను మరింత క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Facebook Inc. rolled out Disaster Maps for India on Thursday to help communities across the country recover and rebuild from natural disasters faster by sharing critical pieces of data sets with humanitarian agencies in a timely manner.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి