జిఎస్టీ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం, వాకౌట్ చేసిన టీఎంసీ
జిఎస్టీ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. బుదవారం సాయంత్రానికి లోక్ సభ ఆమోదం తెలిపింది. లోక్ సభ కంటే ముందే రాజ్యసభలో కూడ ఈ బిల్లు ఆమోదం తెలిపింది. దీంతో జూలై నుండి కేంద్రం జిఎస్టీ నుండి అమలు చేయనున్
న్యూఢిల్లీ: జిఎస్టీ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. బుదవారం సాయంత్రానికి లోక్ సభ ఆమోదం తెలిపింది. లోక్ సభ కంటే ముందే రాజ్యసభలో కూడ ఈ బిల్లు ఆమోదం తెలిపింది. దీంతో జూలై నుండి కేంద్రం జిఎస్టీ నుండి అమలు చేసే అవకాశం ఉంది.
అయితే జిఎస్టీ బిల్లు కీలకమైన ఆర్థిక బిల్లుకు రాజ్యసభ బుదవారం నాడు ఆమోదం తెలిపింది. సవరణలతో కూడిన ఆర్థిక బిల్లుకు సభ ఆమోదించింది.
ఈ బిల్లును బుదవారం నాడు ఉదయం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు.ఈ బిల్లుపై కాంగ్రెస్, సిపిఎం పార్టీలు సవరణలు ప్రతిపాదించాయి.
ఈ సవరణలపై కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్, సిపిఎం నేత సీతారాం ఏచూరి ఓటింగ్ ను కోరారు. అనంతరం ఆర్థిక బిల్లుపై చర్చ జరుగుతుండగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు.

దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం కోసం జీఎస్టీ బిల్లును రూపొందించారు. ఈ బిల్లును ఈ ఏడాది జూలై 1వ, తేది నుండి అమల్లోకి తేవాలని కేంద్రం భావిస్తోంది.
అయితే ఈ బిల్లుకు రెండు సభలు ఆమోదం తెలిపితే కొన్ని రాష్ట్రాలు తమకు జరిగే నష్టాన్నికేంద్రం భరించాలని కోరుతున్నాయి.












Click it and Unblock the Notifications