వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. రంగంలోకి 25 ఫైరింజన్లు
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నరేలాలో గల ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. శనివారం రాత్రి మంటలు రావడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఇప్పటికే 25 ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టాయి. పోలీసులు, అంబులెన్సులు కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేశారు. లోపల ఎవరైనా ఉన్నారా అనే అంశంపై క్లారీటీ రాలేదు.

Comments
English summary
fire broke out at a plastic factory in Delhi's Narela on Saturday night. Twenty-five fire tenders were rushed to the spot to douse the flames.
Story first published: Saturday, May 14, 2022, 23:48 [IST]