లైవ్ డెత్: తుపాకీతో స్టంట్, ఛాతీ చీల్చుకుంటూ వెళ్లిన బుల్లెట్!
నేటి కాలంలో సోషల్ మీడియాలో 'లైకులు', 'వ్యూస్' వస్తే చాలు.. ప్రాణాలనైనా పణంగా పెట్టేస్తున్నారు కొందరు యువకులు. ఆ పిచ్చి కాస్తా ముదిరి చివరకు చితి వరకు చేరుస్తోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఒక భీభత్సమైన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తుపాకీతో రీల్ చేస్తూ, స్టైల్ కోసం ట్రిగ్గర్ నొక్కిన ఒక యువకుడు తన నిండు ప్రాణాన్ని కెమెరా సాక్షిగానే బలి తీసుకున్నాడు.
తూర్పు ఢిల్లీకి చెందిన పవన్ అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని ఒక ప్లాన్ వేశాడు. స్నేహితుడి వద్ద ఉన్న లైసెన్స్డ్ తుపాకీని తీసుకొని, రొమ్ముకు గురిపెట్టుకొని స్టైలిష్‌గా వీడియో తీయాలనుకున్నాడు. స్నేహితుడు కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేస్తున్నాడు. గన్ ఎలా లోడ్ చేయాలో, బటన్ ఎలా నొక్కాలో ఇద్దరి మధ్య చర్చ జరిగింది. తుపాకీని ఛాతీకి ఆనించి, వింత వింత ఫోజులిస్తూ కెమెరా వైపు చూసి పవన్ నవ్వుతూ కనిపించాడు.

'కాల్చొద్దు అన్నా' అని అరుస్తున్నా వినకుండా..
వీడియో రికార్డ్ చేస్తున్న మిత్రుడు ప్రమాదాన్ని పసిగట్టి "కాల్చొద్దు అన్నా.." అని హెచ్చరిస్తున్నా, పవన్ అత్యుత్సాహంలో కంగారు పడ్డాడు. చేతి వేలు తెలియకుండానే ట్రిగ్గర్ మీదకు వెళ్ళింది. ఒక్కసారిగా పేలుడు శబ్దం.. ఆ మరుక్షణమే బుల్లెట్ గుండెల్లోకి దూసుకెళ్లింది. అంతసేపు నవ్వుతూ ఫోజులిచ్చిన పవన్.. రక్తం మడుగులో కెమెరా ముందే కుప్పకూలిపోయాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి ఫైర్ అవ్వడంతో పవన్ అక్కడిక్కడే తుదిశ్వాస విడిచాడు.
స్నేహితుడిదే ఆ తుపాకీ!
ఈ దారుణానికి కారణమైన తుపాకీ పవన్ స్నేహితుడిదని, దానికి లైసెన్స్ కూడా ఉందని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. అయితే, ప్రాణాంతకమైన ఆయుధంతో ఆడుకుంటూ వీడియో తీయడం విచారకరమని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, వీడియో తీసిన స్నేహితుడిని విచారిస్తున్నారు.
వ్యూస్ కోసం ప్రాణాలు ఇస్తారా?
రీల్స్ కోసం ప్రమాదకరమైన సాహసాలు చేయడం ఇప్పుడు ఒక వ్యాధిలా మారుతోంది. కేవలం కొన్ని గంటల పాటు వచ్చే ఆన్‌లైన్ ప్రశంసల కోసం, కన్నవారికి కడుపుకోత మిగల్చడం ఎంతవరకు సమంజసం? ఈ ఘటన ప్రతి యువకుడికి ఒక హెచ్చరిక. ప్రాణం పోయాక ఏ రీల్ కూడా దాన్ని తిరిగి తీసుకురాలేదని గుర్తించాలి.
दिल्ली के दल्लूपूरा इलाके की घटना। पिस्टल निकाले, मैग्जीन लोड और और खुद पर ही तान ही। आशंका है कि ट्रिगर गलती से दब गई। #Delhi #Dallupura #Pistol pic.twitter.com/iNkRKFQvAx
— Chandan Singh Rajput (@imchandansinghs) March 17, 2026
-
తండ్రితో ఇష్యూ.. నాలుగేళ్ల బాలుడిని నేలకేసి విసిరికొడుతూ దాడి !! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications