అయ్యో.. ప్రియుడి మృతదేహాన్ని పెళ్లిచేసుకున్న ప్రియురాలు..
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకర్నొకరు విడదీయలేనంతగా ప్రేమలో మునిగిపోయారు. ప్రియుడే సర్వస్వం అని భావించింది ఆ యువతి. అతడితోనే ఏడడుగులు నడవాలని భావించింది. జీవితాంతం అతడితోనే గడపాలని నిర్ణయించుకుంది. కానీ ఆమె కలల్ని ఆ కుటుంబసభ్యులు ఛిద్రం చేశారు. తమ కుమార్తె ఇతర కులం వ్యక్తిని ప్రేమించిందన్న కోపంతో అతడ్ని యువతి తండ్రి, సోదరుడు కలిసి హత్య చేశారు. అయితే తనతోనే జీవితం అనుకున్న ఆ యువతి సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రియుడి మృతదేహాన్ని వివాహం చేసుకుంది. అంతేకాక ఇక ప్రియుడి ఇల్లే తన ఇల్లు అని స్పష్టం చేసింది.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా జునాఘంజ్ లో విషాదకరమైన ఘటన జరిగింది. ప్రేమించిన వ్యక్తిని.. యువతి తండ్రి, సోదరుడు దారుణంగా హత్య చేశారు. తమ కూతురు వేరే కులం వాడిని ప్రేమించిందన్న కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టారు. అయితే తమ స్వచ్ఛమైన ప్రేమకు మరణం లేదని తలచిన ఆ యువతి ప్రియుడి ఇంటికి బోరున విలపిస్తూ చేరుకుంది. ప్రియుడి మృతదేహం ముందు విలపించింది. మృతదేహానికి బొట్టు, పసుపు పెట్టి వివాహం చేసుకుంది. ఈ దృశ్యాలు అక్కడున్నవారిని కలచివేశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఈ విషాదకరమైన ఘటన గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో జరిగింది. నాందేడ్ జిల్లాలోని ఓల్డ్ గంజ్ ప్రాంతంలో జరిగింది. సాక్షమ్, అంచల్ ఇద్దరూ ప్రేమించుకోగా.. అది జీర్ణించుకోలేని తండ్రి.. సాక్షమ్ ను దారుణంగా తుపాకీతో కాల్చి చంపేశాడు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి గంటల వ్యవధిలోనే నిందుతులను పట్టుకున్నారు. హత్యకు కొన్ని గంటల ముందు యువతి తల్లి.. యువకుడి ఇంటికి వెళ్లి అతడి తల్లిదండ్రులను బెదిరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక అంచల్ మాట్లాడుతూ.. తామిద్దరం మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిపింది. సాక్షమ్ మృతి చెందినా తాను అతడి భార్యగానే ఉంటానని తెలిపింది. సాక్షమ్ వేరే కులం వాడు కావడం వల్లే తమ తల్లిదండ్రులు ఇలా చేశారని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఘటన మహారాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications