Indian railways: రైల్వేకు ఒకరోజుకు ఎంత కరెంట్ బిల్ వస్తుందో తెలుసా?
భారతీయ రైల్వే దేశంలోని ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇండియన్ రైల్వేలో ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అటువంటి ప్రయాణికులు రైల్వే కు సంబంధించిన అనేక విషయాల మీద ఆసక్తిని కనబరుస్తారు. ప్రస్తుతం మనం రైల్వేకు సంబంధించి రైళ్లకు వచ్చే కరెంటు బిల్లుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
ఒక రైలుకు ఒక రోజు కరెంటు బిల్లు ఎంత అవుతుంది?
రైలు నడవడానికి, రైళ్లలో ఏసీ, ఫ్యాన్, లైట్, చార్జింగ్ లాంటి సౌకర్యాలు కల్పించడానికి విద్యుత్ ను వినియోగిస్తున్నారు. ఒక రైలుకు ఒక రోజు కరెంటు బిల్లు ఎంత అవుతుంది అనేది కచ్చితంగా చెప్పడం కష్టం. రైలు రకాన్ని బట్టి, అది నడిచే దూరాన్ని బట్టి, అది వినియోగించిన కరెంటు యూనిట్ల సంఖ్య మరియు వివిధ చార్జీల పైన అది ఆధారపడి ఉంటుంది.

రైల్వే యూనిట్ కి ఏడు రూపాయలు చెల్లించి విద్యుత్ కొనుగోలు
రైళ్లలో విద్యుత్ వినియోగం మూడు రకాలుగా జరుగుతుంది. ఏసీ, ఫ్యాన్, లైట్, చార్జింగ్ పాయింట్, ప్యాంట్రీ ట్రైన్ నిలిపి ఉన్నప్పుడు కూడా కొన్ని వ్యవస్థల కోసం విద్యుత్తును ఉపయోగిస్తారు. రైళ్లు మరియు రైల్వే స్టేషన్ల కోసం భారతీయ రైల్వే యూనిట్ కి ఏడు రూపాయలు చెల్లించి విద్యుత్ కొనుగోలు చేస్తుంది.
రైల్వే వార్షిక విద్యుత్ బిల్లు ఇది
రైళ్లలో ఏసీ బోగీలలో ప్రతి గంటకు సగటున 210 యూనిట్లు విద్యుత్ వినియోగం జరుగుతుంది. 210 యూనిట్లు ప్రతిగంటకు వాడితే 12 గంటలకు రూ.17640 కరెంట్ బిల్లు వస్తుంది .ఇండియన్ రైల్వేలకు సంబంధించి వార్షిక విద్యుత్ బిల్లు సుమారు పదివేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ కరెంట్ బిల్లును రోజువారీగా విశ్లేషిస్తే ప్రతిరోజు రైల్వే సుమారు మూడు కోట్ల రూపాయల కరెంటు బిల్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా.
రైలు ఒక కిలోమీటర్ కు విద్యుత్ వినియోగం 20 యూనిట్లు
ప్రస్తుతం నడుస్తున్న చాలా రైళ్లు విద్యుత్ రైళ్ళు కావడం వల్ల ఈ రైళ్ళు నడపడానికి ఒక కిలోమీటర్ కు 20 యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది. దీంతోపాటు రైలులో వినియోగించే కరెంటు యూనిట్లు కూడా కలుపుకొని బిల్లు వస్తుంది. ఈ విధంగా ఇండియన్ రైల్వే ప్రతి సంవత్సరం పదివేల కోట్ల కరెంటు బిల్లులు చెల్లిస్తోంది.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications