Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొంపముంచిన రైల్వేలు

దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చింది రైల్వే మంత్రిత్వ శాఖ. రైలు ఛార్జీలు అమాంతం పెరిగాయి. ప్రయాణ టికెట్ ధరలు ఇక మరింత భారం కానున్నాయి. పెరిగిన టికెట్ ఛార్జీలు ఈ నెల 26వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. అన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల టికెట్ ధరలు ఒక్కసారిగా జంప్ అయ్యాయి. వాటిని పెంచుతున్నట్లు రైల్వే శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దూర ప్రయాణాలు చేసే వారికి ఈ ధరల పెంపు అదనపు భారం కానుంది.

రైల్వే ప్రకటించిన కొత్త ఛార్జీల్లో 215 కిలోమీటర్ల లోపు సాధారణ తరగతి రైలు ప్రయాణాలపై ఎటువంటి భారం ఉండదు. అంటే ఈ దూరం వరకు ఛార్జీలు పెరగవు. ఇప్పుడున్న టికెట్ ఛార్జీలే యధాతథంగా కొనసాగుతాయి. 215 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారిపై అదనపు భారం పడుతుంది. సాధారణ తరగతి వారికి కిలోమీటరుకు ఒక పైసా పెరగనుంది. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని నాన్ ఏసీ, ఏసీ తరగతులకు కిలోమీటరుకు రెండు పైసలు చొప్పున అదనంగా వసూలు చేస్తారు.

Indian Railways Hikes Train Ticket Fare

ఈ టికెట్ ధరల పెంపు ద్వారా రైల్వే శాఖ సుమారు 600 కోట్ల రూపాయకు పైగా అదనపు ఆదాయాన్ని ఆశిస్తోంది. ఒక ప్రయాణికుడు 500 కిలోమీటర్ల దూరాన్ని నాన్ ఏసీ మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తే.. ప్రస్తుత టికెట్ ధరతో పోలిస్తే అదనంగా 10 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన దూర ప్రయాణాలపై ప్రభావం గణనీయంగా ఉంటుంది. సబర్బన్ రైలు సర్వీసులు, నెలవారీ టిక్కెట్ల ధరలలో ఎటువంటి మార్పు ఉండదు.

తక్కువ ఆదాయ వర్గాల వారు, రోజువారీ ప్రయాణీకులకు అందుబాటులో ఉండేలా 215 కిలోమీటర్ల లోపు ఎటువంటి ఛార్జీలను పెంచట్లేదని రైల్వే పేర్కొంది. ఇటీవలి కాలంలో నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగాయని రైల్వేలు భావిస్తోన్నాయి. మానవ వనరుల కోసమే ఏకంగా 1.15 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తోందని, దీనికి అదనంగా పెన్షన్ వ్యయం 60,000 కోట్ల రూపాయలకు చేరాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం నిర్వహణ వ్యయం 2.63 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. నెట్‌వర్క్ విస్తరణ, భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచే ప్రయత్నాలకు అధిక సిబ్బంది అవసరం పడుతుందని, ఇది ఖర్చులను పెంచుతుందని అధికారులు వివరించారు. పెరుగుతున్న ఖర్చులను ఎదుర్కోవడానికి, పరిమిత ప్రయాణీకుల ఛార్జీల హేతుబద్ధీకరణతో పాటు సరుకు రవాణాను పెంచడంపై రైల్వేలు దృష్టి సారించాయి.

ఇటీవలి పండగ సీజన్‌లో 12,000కు పైగా అదనపు రైళ్లను విజయవంతంగా నడపడం మెరుగైన ప్రణాళిక, సామర్థ్యానికి నిదర్శనమని రైల్వేలు పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా ప్రయాణీకులకు సురక్షితమైన, సరసమైన ప్రయాణాన్ని అందించడానికి, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, ఖర్చులను నియంత్రించడానికి ప్రయత్నాలు కొనసాగుతాయని చెబుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+