హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయలలిత ఆస్తి విలువ 117 కోట్లు: అత్యంత విలువైనది తెలుగు రాష్ట్రంలోనే ఉంది..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆర్కేనగర్ ఉపఎన్నికలో నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా తన ఆస్తుల విలువ రూ. 117 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో చర, స్ధిరాస్తులు కలిసి ఉన్నాయి.

తొమ్మిదేళ్లలో నాలుగు రెట్లు పెరిగిన జయలలిత ఆస్తుల చిట్టాలో అత్యంత విలువైన ఆస్తి, ఆమె సొంత రాష్ట్రంలో కాకుండా తెలంగాణలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రంలో ఉన్న రెండు ఆస్తులే ఆమె మొత్తం ఆస్తుల విలువలో సగానికి పైగా ఆక్రమించాయి.

జయలలితకు రంగారెడ్డి జీడిమెట్లలో ఫాం హౌజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఫాం హౌజ్ విలువ రూ. 14.44 కోట్లుగా ఆమె తన ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. దీంతో పాటు హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో జయలలితకు ఓ స్ధిరాస్తి ఉంది.

దీని విలువ రూ. 50.37 కోట్లు. తన ఎన్నికల అఫిడవిట్‌లో ఈ రెండింటి విలువే సగానిపైగా ఉన్నట్లు జయలలిత వెల్లడించారు. వీటితో పాటు జయలలిత మిగతా ఆస్తుల వివరాలిలా ఉన్నాయి.

Jayalalithaa declares assets worth Rs. 117 crore

జయలలిత ఆస్తుల వివరాలు:

  • ప్రస్తుతం నివాసం ఉంటున్న పోయెస్ గార్డెన్ విలువ - రూ. 43.96 కోట్లు
  • జీడిమెట్లలోని ఫాం హౌజ్ - రూ. 14.44 కోట్లు
  • 7 వాహనాలు(టొయోటా ప్రాదా ఎస్‌యూవీ (2), 1980కాలానికి చెందిన అంబాడిసడర్, 1990కు చెందిన కాంటెస్సా) - రూ. 42,25 లక్షలు
  • 2013-14 సంవత్సరానికి గాను ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్స్ ప్రకారం - రూ. 33.32 లక్షలు
  • జయలలిత ఎవరిపై ఆధారపడి లేదు.
English summary
As on Friday, the AIADMK supremo has declared assets worth Rs. 117.13 crore. She has movable assets worth Rs. 45.04 crore and immovable assets worth Rs.72.09 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X