కేరళ, పుదుచ్చేరి, అసోంలో నేడే పోలింగ్.. ఏర్పాట్లు పూర్తి..
కేరళ, పుదుచ్చేరి, అసోంలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి ఈ మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 35 జిల్లాల్లో 31,490 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అసోంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 126 నియోజకవర్గాల్లో దాదాపు 720 మందికి పైగా అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో నమోదు చేయనున్నారు.

ఇక కేరళలోని మొత్తం 140 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు గాను 883 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కేరళలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కేరళలో మొత్తం 2.71 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 1.32 కోట్ల మంది కాగా మహిళా ఓటర్లు 1.39కోట్ల మంది ఉన్నారు.
ఇక కేంద్ర పాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. 30 అసెంబ్లీ స్థానాలకు గాను 294 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇక మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 4 న వెలువడనున్నాయి. ఇక తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ జరుగుతుంది. బెంగాల్లో ఏప్రిల్ 23న, ఏప్రిల్ 29న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
-
మూడు రాష్ట్రాల్లో పోలింగ్: అందరి కళ్లు కేరళం వైపే..!! -
Neela క్యూట్ వెల్కమ్.. మురిసిపోయిన ఓటర్లు -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం












Click it and Unblock the Notifications