వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్వానికి మరో షాక్: నటుడు పరేష్ రావల్‌కు టిక్కెట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Advani
అహ్మదాబాద్: భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల కృష్ణ అద్వానీకి మరోసారి షాక్ తగిలింది. 9 మంది అభ్యర్థులతో తాజా జాబితాను విడుదల చేసిన బిజెపి అహ్మదాబాద్ తూర్పు సిట్టింగ్ ఎంపీ, ఆద్వానీ విధేయుడు, ఏడుసార్లు ఎంపీగా ఎన్నికైన హరీన్ పాఠక్ స్థానాన్ని బాలీవుడ్ నటుడు పరేష్ రావల్‌కు కేటాయించింది.

నిజానికి ఒక దశలో ఈ స్థానం నుంచి పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ పోటీ చేయాలనుకున్నారంటే దీని ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక.. బిజెపి భీష్ముడు మనసుపడ్డ భోపాల్ స్థానానికి బిజెపి గుజరాత్ ఆఫీస్ ఇన్‌చార్జ్ అలోక్ సంజర్ పేరును ప్రకటించారు.

తాజా జాబితా ప్రకారం పంచ్‌మహల్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపి ప్రభాత్ సింగ్ చౌహాన్, సబర్‌కాంతా నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే దీప్ సిన్హా రాథోడ్, జునాగఢ్, ఖేడా నియోజకవర్గాల నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న రాజేష్ చుడస్మా, దేబూ సింగ్ చౌహాన్ పోటీ చేయనున్నారని పార్టీ జనరల్ సెక్రటరీ తవార్‌చంద్ గెహ్లాట్ శనివారం ప్రకటించారు.

ఇవన్నీ గుజరాత్‌లో స్థానాలు. అటు, మధ్యప్రదేశ్‌లో మాజీ మంత్రి లక్ష్మీ నారాయణ్ యాదవ్ సాగర్ నియోజకవర్గం నుంచి, ఖజురహో నుంచి మరో మాజీ మంత్రి నాగేంద్ర సింగ్, మందసౌర్ లోక్‌సభ స్థానానికి మందసౌర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు సుధీర్ గుప్తా పోటీ చేయనున్నారు.

English summary
In what could stoke a fresh controversy in the BJP after the row over LK Advani's ticket, the party today replaced seven-time MP Harin Pathak, a close aide of the senior leader, with actor Paresh Rawal for the Ahmedabad East Lok Sabha seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X