5kg LPG Cylinder: చిన్న బండకు పెద్ద డిమాండ్-రికార్డు స్థాయి కొనుగోళ్లు..!
ఇరాన్ వార్ ప్రభావంతో మన దేశంలో ఎల్పీజీ సిలెండర్ల (LPG cylinder)కొరత ఏర్పడింది. యుద్ధ భయాలతో జనం ముందస్తు బుకింగ్స్ , కొనుగోళ్ల కోసం ఎగబడ్డారు. దీంతో ఎల్పీజీ సిలెండర్లు దొరకని పరిస్ధితి వచ్చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఐదు కేజీల గ్యాస్ సిలెండర్లను తెరపైకి తెచ్చింది. ఎలాంటి సబ్సిడీలు లేకుండా కనీస గుర్తింపు పత్రాలతో తీసుకునే అవకాశం కల్పించిన ఈ సిలెండర్ల కోసం ఇప్పుడు జనం భారీగా ఎగబడుతున్నారు. దీంతో ఇవాళ్టికి 6.6 లక్షల చిన్న సిలెండర్లు అమ్ముడయ్యాయి.
ఎల్పిజి పంపిణీ కేంద్రాలలో నేరుగా కౌంటర్లో కొనుగోలు చేసే అవకాశం ఉన్న 5 కేజీల చిన్న ఎల్పిజి సిలిండర్ల అమ్మకాలను కేంద్రం ముమ్మరం చేసింది. దీంతో మార్చి 23 నుంచి ఇప్పటివరకు సుమారు 6.6 లక్షల సిలెండర్లు ఇలా అమ్ముడయ్యాయి. సబ్సిడీతో లభించే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్లలా కాకుండా, ఎఫ్టిఎల్ సిలిండర్లు అని పిలిచే ఈ 5 కేజీల బాటిళ్లకు మార్కెట్ ధరలకే ధర నిర్ణయిస్తారు. సమీపంలోని ఎల్పిజి పంపిణీ కేంద్రం నుంచి వీటిని కొనుగోలు చేయొచ్చు. ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ కూడా అక్కర్లేదు. దీంతో జనం వీటి కోసం ఎగబడుతున్నారట.

నిన్న (ఏప్రిల్ 4న) 90 వేలు పైగా 5 కేజీల ఎఫ్టిఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి. మార్చి 23 నుంచి ఇప్పటివరకు సుమారు 6.6 లక్షల 5 కేజీల ఎఫ్టిఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయని చమురు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎల్పిజి పంపిణీ కేంద్రాల వద్ద కొరత ఉన్నట్లు ఎలాంటి నివేదికలు లేవని, రోజంతా 5.1 లక్షలకు పైగా గృహ వినియోగ సిలిండర్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపింది. మొత్తం డిమాండ్‌లో 95 శాతం ఆన్లైన్ బుకింగ్‌ల ద్వారానే జరిగిందని పేర్కొంది. మరోవైపు ఎల్పీజీ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. మార్చి నుంచి 50,000కు పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఎల్పిజి పంపిణీదారులకు 1,400కు పైగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 36 డీలర్‌షిప్‌లను రద్దు చేశారు.
-
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
PNG కనెక్షన్ కావాలా? ఈ నంబర్లకు కాల్ చేస్తే చాలు -
ముంచుకొస్తున్న గ్యాస్ సంక్షోభం.. పాత బుకింగ్‌లకే దిక్కులేని పరిస్థితి! -
ఫ్రీ టిఫిన్.. గ్యాస్ కష్టాల్లో అదిరిపోయే ఐడియా -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ??














Click it and Unblock the Notifications