షాక్: ఆధార్ లేకపోతే స్కాలర్ షిప్ కట్, అన్ని స్కీమ్ లు ఆధార్ తో లింక్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: స్కాలర్ షిప్ లకు ఆధార్ తో కేంద్రం లింక్ చేసింది. ఆధార్ ఆధారంగా తమ పూర్తివివరాలతో ధరఖాస్తు చేసుకోకపోతే కేంద్రం నుండి వచ్చే ప్రోత్సహక స్కాలర్ షిప్ లను ఇవ్వబోమని కేంద్రం ప్రకటించింది.

ఈ మేరకు ఈ ఏడాది మార్చి9వ, తేదిన కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఓ నోటిఫికేషన్ ను జారీ చేసింది. దిశ, ఇన్స్ పైర్ ఇన్స్ ఫైర్ స్కాలర్ షిప్, ఇన్స్ ఫైర్ ఇంటర్న్ షిప్ ఇన్స్ ఫైర్ ఫెలో షిప్ , ఇన్స్ ఫైర్ ఫ్యాకల్టీ కింద కేంద్రం నుండి స్కాలర్ షిఫ్ తో పాటు , ఇతర ప్రోత్సాహకాలను పొందేందుకుగాను ఆదార్ తో లింక్ చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది.

ఈ పధకానికి ధరఖాస్దు చేసుకొనేందుకుగాను సెప్టెంబర్ 30వ, తేదిగా నిర్ణయించారు.ఆధార్ తో తమ ధరఖాస్తులను అనుసంధానం చేసుకోవాలని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ కోరింది.

No Aadhaar, no scholarship

అయితే కేంద్రం సైన్స్ పట్ల విధ్యార్థుల్లో ఆసక్తిని పెంచేందుకుగాను అవార్డులను ప్రకటించింది.సైన్స్ లో విధ్యార్థులు రీసెర్చ్ చేసేలా ప్రోత్సహించేందుకుగాను కేంద్రం తెచ్చింది. మిడిల్ స్కూల్ విధ్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించేందుకుగాను కొత్త పథకాలను కేంద్రం తెచ్చింది.

అయితే గత ఏడాది జూలై నాటికి 1.3 మిలియన్ విద్యార్థులు ఈ పథకాల కింద ప్రయోజనం పొందారు. అంతేకాదు ఈ పథకాల కింద సుమారు 10 వేల మంది విధ్యార్థులు రూ.80వేల రూపాయాలను పొందారు.

మరో వైపు రెండు లక్షల మంది విధ్యార్తులు ప్రతి నెల రూ. 5 వేల రూపాయాలను ప్రతి ఏటా పొందుతున్నారు.రానున్న ఐదేళ్ళలో దేశ వ్యాప్తంగా కొత్తగా శాస్తవేత్తలను తయారు చేసేందుకుగాను ఈ రకమైన పథకాలు ఉపయోగపడతాయని భావించింది.

ఆధార్ తప్పనిసరి కాదు

అయతేన ఆధార్ తప్పనిసరి కాదని ఇప్పటికే సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది.మాజీ చీఫ్ జస్టిస్ హెచ్ .ఎల్. దత్తు నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అయితే ఆధార్ అనేది స్వచ్చంధంగా ఇవ్వాల్సిందేనని, తప్పనిసరికాదన్నారు.

అయితే ఎల్ పి జి సిలిండర్ల సబ్సీడి పొందేందుకుగాను ఆధార్ ను ఉపయోగిస్తున్నారు.ఆధార్ పై తప్పనిసరి చేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన ప్పటికీ కూడ కేంద్రం కొత్త మిడిల్ స్కూల్ విధ్యార్థులకు ప్రోత్సహకాలను అందించేందుకుగాను ఆధార్ ను లింక్ చేయడం సరికాదనే అభిప్రాయాలు కూడ వ్యక్తం అవుతున్నాయి.

ఇదిలా ఉంటే కేంద్రం అమలు చేస్తున్న అనేక పథకాలకు ఆధార్ ను తప్పనిసరి చేస్తోంది. బోఫాల్ బాధితులకు గ్రాంట్లను ఇవ్వడం, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, సర్వ శిక్షణ అభియాన్ , మధ్యాహ్నభోజన పథకాలకు కూడ ఆధార్ ను లింక్ చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A key set of scholarships that encourages middle school students to pursue careers in science, collegians to opt for basic science research and women to return to labs after a break in career, will soon require an Aadhar registration.
Please Wait while comments are loading...