విమాన ప్రయాణికులకు ముఖ్య గమనిక
విమాన ప్రయాణాల్లో పవర్ బ్యాంకుల వినియోగాన్ని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ నిషేధించింది. అందులో ఉండే లిథియం బ్యాటరీలు పేలిపోవడానికి, మంటలు వేగంగా వ్యాప్తిచెందడానికి కారణాలు అవుతాయనే ఉద్దేశంతో డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. అగ్నిప్రమాదాలను నివారించడంలో భాగంగా పవర్ బ్యాంకులను ప్రయాణికులెవరూ కూడా తమ వెంట తీసుకుని రాకూడదని సూచించింది. దీనికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది.
విమానంలో మొబైల్ ఫోన్లు లేదా ఇతర గాడ్జెట్లను ఛార్జ్ చేయడానికి పవర్ బ్యాంకులను విమాన సీటు పవర్ అవుట్లెట్ల ద్వారా కూడా అనుమతించరు. వీటిని హ్యాండ్ బ్యాగేజీలో మాత్రమే తెచ్చుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది నవంబర్‌లో జారీ అయిన డేంజరస్ గూడ్స్ అడ్వైజరీ సర్క్యులర్ ప్రకారం, పవర్ బ్యాంకులు, స్పేర్ బ్యాటరీలను ఓవర్‌హెడ్ కంపార్ట్మెంట్లలో నిల్వ చేయకూడదు. అక్కడ మంటలు సంభవించినప్పుడు వాటిని సులువుగా గుర్తించకపోవచ్చు.

లిథియం బ్యాటరీలు అత్యంత శక్తివంతమైనవి కావడం, మంటలను శరవేగంగా సృష్టించగలగడం, పేలుడుకు దారి తీయడం, అగ్నికీలలు వ్యాప్తి చెందడానికి కారకాలుగా డీజీసీఏ పేర్కొంది. లిథియం బ్యాటరీల నుంచి మంటలు చెలరేగినప్పుడు వాటిని ఆర్పడం కూడా కష్టతరమని, అందుకే వీటిని ప్రమాదకరమైనవిగా అభివర్ణించింది. పవర్ బ్యాంకులు, పోర్టబుల్ ఛార్జర్లు, లిథియం బ్యాటరీలను కలిగి ఉన్న ఇటువంటి పరికరాలు మంటలు రేగడానికి మూలాలుగా పనిచేస్తాయని, విమానంలో అగ్ని ప్రమాదాలకు దారి తీయవచ్చని వివరించింది.
ఓవర్‌హెడ్ స్టోవేజ్ బిన్ లేదా క్యారీ ఆన్ బ్యాగేజీలో ఉన్న లిథియం బ్యాటరీలను గుర్తించడం కష్టమని, ఇది పొగ లేదా మంటలు వచ్చినప్పుడు వాటిని వెంటనే గుర్తించలేమని డీజీసీఏ తెలిపింది. ఫలితంగా వాటి నియంత్రణలో జాప్యం జరగొచ్చని, విమాన భద్రతకు ప్రమాదం పెరుగుతుందని పేర్కొంది. లిథియం బ్యాటరీ మంటలు అధిక వేడి, ఓవర్ఛార్జింగ్, నలిగిపోవడం లేదా అంతర్గత షార్ట్ సర్క్యూట్ల ద్వారా సంభవించవచ్చని వివరించింది.
లిథియం బ్యాటరీ సంఘటనల నేపథ్యంలో ఎమిరేట్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ వంటి అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఇలాంటి ఆంక్షలను ప్రవేశపెట్టాయి. ఇటీవల, హాంగ్జౌ నుండి సియోల్‌కు వెళ్తున్న చైనాకు చెందిన ఎయిర్‌బస్ ఎ321 విమానంలో చోటు చేసుకున్న పవర్ బ్యాంక్ మంటల ఘటన, క్యాబిన్‌ను పొగతో నింపి ప్రయాణీకులలో తీవ్ర భయాందోళనలు రేపింది. ఈ సంఘటనలన్నీ ప్రస్తుత నిషేధానికి ముఖ్య కారణం అయ్యాయి.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!












Click it and Unblock the Notifications