ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు: రికార్డు స్థాయిలో నామినేషన్లు: ఎంత మంది ?

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు రసవత్తరంగా మారిపోయాయి. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్ కే నగర్ నుంచి పోటీ చెయ్యడానికి క్యూ కట్టేశారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల నామినేషన్ వెయ్యడానికి గురువారం (మార్చి 23) చివరి రోజు.

గురువారం వరకు ఆర్ కే నగర్ లో పోటీ చెయ్యడానికి 60 మంది నామినేషన్ వేశారు. జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్ కే నగర్ లో పోటీ చెయ్యడానికి చాల మంది పోటీ పడుతున్నారు. అయితే వీరిలో ఎంత మంది నామినేషన్ ఉపసంహరించుకుంటారో అనేది వేచిచూడాలి.

Nomination Files End in R.K.nagar.

శశికళ వర్గంలోని టీటీవీ. దినకరన్, పన్నీర్ సెల్వం వర్గంలోని మధుసూదనన్, జయలలిత మేనకోడలు దీపా జయకుమార్, డీఎంక పార్టీకి చెందిన మరుతు గణేష్, బీజేపీ నుంచి గంగైఅమరన్ తదితరులు ఇప్పటికే ఆర్ కే నగర్ నియోజక వర్గం నుంచి బరిలో ఉన్నారు.

వీరు కాకుండా మొత్తం 60 మంది ఆర్ కే నగర్ ఉప ఎన్నికల బరిలో ఉన్నారు. మొత్తం మీద ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండాకుల గుర్తు లేకపోవడంతో ఇప్పుడు ఉప ఎన్నికలు రసవత్తరంగా మారాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tamil Nadu: Nomination Files End in R.K.nagar. So For 60 candidates filed nomination.
Please Wait while comments are loading...