దినకరన్ 420, అబద్ధాలకోరు: పన్నీర్ సెల్వం ధ్వజం

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: ఆర్కే నగర్ విజేత దినకరన్‌ను తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం 420గా, అబద్ధాలకోరుగా అభివర్ణించారు. టిటివీ దినకరన్ చెప్పేవన్నీ అబద్ధాలని ఆయన సోమవారం అన్నాడియంకె కేంద్ర కార్యాలయంలో అన్నారు.

తాను 420ని దినకరన్ తమతో స్వయంగా చెప్పారని ఆయన అన్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన దినకరన్ భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. ఆయన చేతిలో అన్నాడియంకె అభ్యర్థి ఈ. మధూసూదనన్‌ 45 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

OPS calls Dhinakaran '420' and liar

ఉప ఎన్నికలో పార్టీ పనితీరును సమీక్షించడానికి ముఖ్యమంత్రి ఇ. పళనిస్వామి, ఓ పన్నీరు సెల్వం సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ పనితీరును సమీక్షించిన వారు ఆరుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

అన్నాడియంకె ప్రభుత్వం మూడు నెలల్లో కూలిపోతుందని దినకరన్ ఆర్కే నగర్‌లో విజయం సాధించిన తర్వాత అన్నటువంటి విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AIADMK leader and Tamil Nadu Deputy Chief Minister O Panneerselvam (OPS) on Monday attacked TTV Dhinakaran, calling him a “liar” and “420”.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి