డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..!
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. హీరో విజయ్ పార్టీ టీవీకేతో పొత్తు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ.. తాజాగా ఆయనకు డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు 80 సీట్లు ఇస్తామని కీలక ఆఫర్ ఇచ్చింది. ఇప్పటివరకూ బీజేపీతో పొత్తును పలుమార్లు తిరస్కరిస్తూ వస్తున్న విజయ్.. ఈ ఆఫర్ పై స్పందించాల్సి ఉంది. అంతలోనే బీజేపీ (BJP)మిత్రపక్షం, విజయ్ (Vijay) అంటే అస్సలు పడని అన్నాడీఎంకే (AIADMK) కాషాయపార్టీకి షాకిచ్చింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హీరో విజయ్ పార్టీ టీవీకేతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (Palaniswami) ఇవాళ తేల్చిచెప్పేశారు. బీజేపీ-అన్నాడీఎంకే కూటమిలోకి విజయ్ ను ఆహ్వానిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కేవలం మీడియా ఊహాగానాలుగా ఆయన కొట్టిపారేశారు. దీంతో ఇవాళ ఉదయం విజయ్ కు డిప్యూటీ సీఎం ప్లస్ 80 ఎమ్మెల్యేల్ని బీజేపీ ఆఫర్ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టినట్లయింది.

టీవీకే ఎన్డీఏలో చేరుతుందా లేదా అని పళనిస్వాని మీడియా ప్రశ్నిస్తే.. తాను ఇప్పటికే స్పష్టంగా చెప్పానని, ఇప్పటివరకు, తాము టీవీకేతో చర్చలు జరపలేదని తేల్చేశారు. అటువంటప్పుడు కూటమి ఎలా ఏర్పడుతుందని ప్రశ్నించారు. కూటమి ఉంటుందని మీడియా అనవసరమైన వాదనను పెంచి, పెద్దదిగా చూపుతోందన్నారు. ఏఐఏడీఎంకేకు ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని, కూటమి కోసం తాము ఎలాంటి చర్చలు జరపలేదని ఆయన స్పష్టం చేశారు. మీడియా సంస్థ 'చాణక్య' నిర్వహించిన కార్యక్రమంలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొంటూ పళనిస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications