కంప్యూటర్ బేస్డ్ పరీక్షలా..? రాత పరీక్షలా..? పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సు ఇదే..
దేశవ్యాప్తంగా నిర్వహించే ఎంట్రాన్స్ పరీక్షలకు కంప్యూటర్ బేస్డ్ టెస్టు కన్నా రాత పరీక్ష నిర్వహించడమే ఉత్తమమని పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సు చేసింది. కంప్యూటర్ బేస్డ్ పరీక్షలో అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని ఇటీవల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన ఆన్ లైన్ ఎగ్జామ్స్ లో ఇది రుజువైందని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన ఏర్పడిన పార్లమెంటరీ కమిటీ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న ఆన్ లైన్ పరీక్షల విధానాన్ని సమీక్షించింది.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం చాలా ప్రవేశ పరీక్షలు ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడుతున్నారు. అయితే యూపీఎస్సీ , సీబీఎస్సీ .. తదితర కొన్ని బోర్డులు మాత్రమే రాత పరీక్షను నిర్వహిస్తున్నాయి. అయితే ఇటీవలి కాలంలో కంప్యూటర్ బేస్డ్ పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రవేశ పరీక్షలను రాతపూర్వక విధానంలో నిర్వహిస్తే బెటర్ అని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సిఫార్సులు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన ఏర్పడిన పార్లమెంటరీ కమిటీ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న ఆన్ లైన్ పరీక్షల విధానాన్ని సమీక్షించింది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ ఏడాది నిర్వహించిన 14 పోటీ పరీక్షలను సమీక్షించింది. అందులో దాదాపు ఐదు పరీక్షల్లో సాంకేతిక సమస్యలు, లేదా ఇతర సమస్యలు తలెత్తినట్లు వెల్లడైంది. వీటిల్లో యూజీసీ- నెట్ పరీక్ష వాయిదా పడింది, సీఎస్ఐఆర్- నెట్ అలాగే నీట్- పీజీ పరీక్ష వాయిదా పడింది. అలాగే నీట్- యూజీ పరీక్ష పేపర్ లీక్స్ అయింది. సీయూఈటీ ఫలితాల్లో అవకతవకలు వచ్చాయి. అలాగే జేఈఈ మెయిన్ 2025 పరీక్షలో దాదాపు 12 ప్రశ్నలను తప్పులుగా భావించి తొలగించారు.
ఈ పార్లమెంటరీ కమిటీ రాత పరీక్ష అలాగే కంప్యూటర్ బేస్డ్ పరీక్ష రెండింటినీ సమీక్షించింది. అయితే రాత పరీక్షలో పేపర్ లీక్స్ సమస్య అలాగే.. కంప్యూటర్ బేస్డ్ పరీక్షలో హ్యాకింగ్ సమస్య తలెత్తే అవకాశం ఉన్నట్లు అంచనాకు వచ్చింది. అయితే ఈ రెండింటిలో రాత పరీక్ష వైపే పార్లమెంటరీ కమిటీ మొగ్గు చూపింది. ఈ పరీక్షనే సిఫార్సు చేసింది. అలాగే కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు కేవలం ప్రభుత్వ లేదా ప్రభుత్వం ఆధీనంలో ఉండే సెంటర్లలోనే నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది.

అలాగే పోటీ పరీక్షల పేపర్ తయారీ, అడ్మినిస్ట్రేషన్, కరెక్షన్ విధానంలో ఇప్పటికే బ్లాక్ లిస్ట్ లో పెట్టిన కంపెనీలకు అధికారాలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. గత ఆరేళ్లలో ఎన్టీఏ ఫీజుల రూపంలో రూ.3,512.88 కోట్లను వసూలు చేసిందని, అందులో రూ.3,064.77 కోట్లను ఖర్చు చేసిందని పార్లమెంటరీ కమిటీ తెలిపింది. ఇంకా రూ. 448 కోట్లు మిగిలి ఉందని స్పష్టం చేసింది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications