వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సొరంగంలో శవాలు: వారిద్దరు అక్కడే (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బియాస్ నదిలో మృతదేహాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విజ్ఞాన యాత్రకు వెళ్లిన 24 మంది విద్యార్థులు బియాస్ ‌నదిలో గల్లంతయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు కేవలం 8 మృతదేహాలను మాత్రమే వెలికి తీయగలిగారు. ఇంకా 16 మృతదేహాలు లభించాల్సి ఉంది.

మొత్తం 30 బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలు పండో డ్యాం కిందికి వెళ్లిపోయి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పండో డ్యాం కింద9 కిలోమీటర్ల సొరంగం ఉంది. సొరంగంలో మృతదేహాలు కూరుకుపోయి ఉంటే తీయడం కష్టమేనని భావిస్తున్నారు. కాగా, లార్జీ డ్యామ్ నుంచి నీటి విడుదలను ఆపేసి గాలింపు చర్యలు జరుగుతున్నాయి.

బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు కొనసాగుతోంది. గాలింపు కోసం మానవ రహిత విమానాలు రంగంలోకి దిగాయి. తెలంగాణ హోంమంత్రి నాయని నర్సింహా రెడ్డి, తెరాస పార్లమెంటు సభ్యులు జితేందర్‌రెడ్డి, వినోద్, ఎన్డీఆర్ఎంఏ వైస్ చైర్మన్ మర్రిశశిధర్‌రెడ్డి దగ్గరుండి గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

అలాగే ఏడీజీ రాజవీ త్రివేదీ ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇంగ్లిష్ చానెల్ ఈదిన అనుభవం తనకుందని, గాలింపు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉంటానని ఆయన తెలిపారు. తెలుగుదేశం ఎంపీలు కొనకళ్ల, మాగంటి బాబు శుక్రవారం మండి చేరుకున్నారు.

నాయని, జితేందర్ రెడ్డి ఇలా..

నాయని, జితేందర్ రెడ్డి ఇలా..

తెలంగాణ హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి, తెరాస పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి బియాస్ నది వద్దనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

నాయని నర్సింహా రెడ్డి ఇలా...

నాయని నర్సింహా రెడ్డి ఇలా...

బియాస్ ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్న తెలంగాణ హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

బియాస్ నదిలో రాళ్ల మధ్య

బియాస్ నదిలో రాళ్ల మధ్య

బియాస్ నదిలో మృతదేహాల కోసం గాలింపు చర్య చాలా కఠినంగా మారింది. రాళ్ల మధ్య శవాలు చిక్కిపోయి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎంపి జితేందర్ రెడ్డి ఇలా..

ఎంపి జితేందర్ రెడ్డి ఇలా..

తెరాస పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి, తెలంగాణ హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి సహాయక చర్యలను పర్వవేక్షిస్తూ ఇలా..

English summary
Rescue operations in Beas river are continuing for the missing students from Hyderabad. Telangana home minister Nayani Narsimha Reddy and MPs Jitender Reddy, Vinod are reviewing rescue operations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X