వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీకి ప్రాణగండం: భారీ స్కెచ్ వేసిన ఉగ్రవాదులు..ఆరోజే ఎందుకు?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు.. జమ్మూకశ్మీర్ విభజన.. తాజాగా పౌరసత్వ సవరణ చట్టం.. ఇవన్నీ మోడీ సర్కార్ చేయడం వల్ల ఆయన టార్గెట్ అయ్యారా..? ఉగ్రవాదులు ప్రధాని మోడీని టార్గెట్ చేశారా అంటే ఔననే సమాధానం చెబుతున్నారు ఇంటెలిజెన్స్ వర్గాలు. ఇందుకు భారీ స్కెచ్ కూడా వేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.

మోడీకి ప్రమాదం పొంచి ఉందన్న నిఘావర్గాలు

మోడీకి ప్రమాదం పొంచి ఉందన్న నిఘావర్గాలు

ప్రధాని నరేంద్ర మోడీకి ముప్పు పొంచి ఉందని హెచ్చరించాయి నిఘా వర్గాలు. ఉగ్రవాదులు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని నివేదిక ఇచ్చింది. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ రాంలీలా మైదాన్‌లో భారీ ర్యాలీలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టంతో ఢిల్లీ అట్టుడికిపోతుండగా ఆదివారం రోజున ప్రధాని ర్యాలీ జరగనుంది. ఈక్రమంలోనే పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు ప్రధాని మోడీని టార్గెట్ చేశాయని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈమేరకు ప్రధానికి రక్షణ కవచంలో ఉండే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌నకు మరియు ఢిల్లీ పోలీసులకు ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక అందించాయి.

దేశంలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు

దేశంలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు


నివేదికలో సూచించినట్లుగానే ప్రధాని సభ సందర్భంగా ఎస్పీజీ మరియు ఢిల్లీ పోలీసులు ఫాలో కావాలని నిఘావర్గాలు తెలిపాయి.ఇప్పటికే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు భారత్‌కు చేరుకున్నారని నిఘావర్గాలు చెప్పాయి. డిసెంబర్ 22వ తేదీన జరిగే ఈ బహిరంగ సభలో పెద్ద ఎత్తున్న పార్టీ కార్యకర్తలు, ప్రజలు, మీడియా ప్రతినిధులు రానున్న నేపథ్యంలో ఇక్కడే ప్రధాని మోడీని టార్గెట్ చేశారని నిఘావర్గాలు వెల్లడించాయి.

 ర్యాలీలో మోడీ ఎలాంటి ప్రకటన చేయనున్నారు..?

ర్యాలీలో మోడీ ఎలాంటి ప్రకటన చేయనున్నారు..?

ఇక ఈ ర్యాలీని బీజేపీ ఏర్పాటు చేస్తోంది. ఈ సభలో పలు అంశాలను ప్రధాని ప్రస్తావించనున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో అనుమతి లేని కాలనీలను రెగ్యులరైజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఇక్కడ ప్రకటించి ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తోంది. ప్రధాని మోడీతో పాటు ఈ మెగా ర్యాలీలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక ఇచ్చిన పుస్తకంలోని చాప్టర్ 10లో ప్రధాని సభకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పొందుపర్చింది ఇంటెలిజెన్స్ విభాగం

మోడీ టార్గెట్ ఇందుకేనా..?

మోడీ టార్గెట్ ఇందుకేనా..?

పౌరసత్వ సవరణ చట్టం, రామజన్మభూమి తీర్పు, ఆర్టికల్ 370 రద్దు లాంటి అంశాలతో పాటు పాకిస్తాన్‌లో ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడులు వంటి అంశాలు ఉగ్రవాదులను దాడిచేసేలా ప్రేరేపిస్తున్నాయని నిఘావర్గాలు చెప్పుకొచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఉగ్రవాదులు దాడి చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని దాన్ని ఎంతమాత్రం అలుసుగా తీసుకోరాదని గట్టిగా హెచ్చిరంచింది నిఘా వర్గం. అంతేకాదు ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ విభాగం ఆర్థిక సహకారం, దాడులకు కావాల్సిన మెటీరియల్‌ను మొత్తం సమకూరుస్తోందని నిఘావర్గాలు తెలిపాయి.

English summary
Prime Minister Narendra Modi will be addressing a mega rally in the national capital on Sunday.Ahead of the rally, intelligence agencies have warned that terrorist outfits based out of Pakistan are planning "to target Prime Minister Narendra Modi at the Ramlila ground on December 22"
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X