వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తుది నిర్ణయం చిన్నమ్మదే, శత్రువులు.. కుట్రలు సహజం, స్టాలిన్ పై మండిపడిన దినకరన్

ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్తి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతు విషయంలో పూర్తి నిర్ణయాధికారం పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళదేనని అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ చెప్పారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

చెన్నై: ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్తి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతుపై అన్నాడీఎంకే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ చెప్పారు. ఈ విషయంలో పూర్తి నిర్ణయాధికారం పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళదేనని తెలిపారు.

మంగళవారం చెన్నైలో విలేకరులతో మాట్లాడిన దినకరన్‌.. ఒకటిరెండు రోజుల్లో బెంగళూరు జైలుకు వెళ్లి చిన్నమ్మను కలుస్తానని, ఆమె ఏం సూచిస్తారో ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తామని పేర్కొన్నారు.

ttv-dinakaran

రాజకీయాల్లో కుట్రలు సహజం...

ఎమ్మెల్యేలకు ముడుపుల వ్యవహారంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ దినకరన్‌.. ప్రతిపక్ష డీఎంకేపై నిప్పులుచెరిగారు. 'ప్రభుత్వాన్ని, అన్నాడీఎంకేను అస్థిరపర్చేందుకు శత్రువులు భారీ ఎత్తున కుట్రలు చేస్తున్నారు. రాజకీయాల్లో అది సహజం..' అని వ్యాఖ్యానించారు.

తమిళనాడు ప్రస్తుత సీఎం పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు భారీ ఎత్తున ముడుపులు అందినట్లు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే శరవణన్‌.. స్టింగ్‌ ఆపరేషన్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే.

అవకాశం కోసం ఎదరుచూస్తోన్న ప్రతిపక్ష డీఎంకే.. ముడుపులతో గట్టెక్కిన ముఖ్యమంత్రి పళనిస్వామిని తక్షణమే గద్దె దింపాలంటూ తమిళనాట పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోంది.

English summary
Jailed AIADMK general secretary Sasikala will take a decision on how the party will vote in the presidential election, party Deputy General Secretary TTV Dinakaran said. "It will be decided by Sasikala," Dinakaran told reporters after meeting her in jail when he was asked which way the party MPs and MLAs would vote in the 17 July election. Earlier, Dinakaran had said that it was natural for the "enemies" of the AIADMK to try and destabilise the party and the government, but "we will" do everything to protect the government. "In politics, our enemies will try to destabilise our party and the government. It is natural, but we will protect the government," he told reporters after meeting Sasikala. He was replying to a question whether Prime Minister Narendra Modi-led government was involved in any political conspiracy against the AIADMK government and himself personally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X